Breaking News

“ఐష్టా” టెన్నిస్ టోర్నమెంట్ లో VMC ఉద్యోగి ఛాంపియన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Oct 13-17, 2025 వరకు ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లో జరిగిన ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో 35+ డబుల్స్ విభాగంలో విజయవాడ కార్పొరేషన్ ఎస్టేట్ సెక్షన్ లో పనిచేస్తున్న అడ్మిన్ సెక్రెటరీ రామకూరి రాంబాబు మహేష్ తో (విజయనగరం) జోడి కలిసి డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్నారు. రాష్ట్రస్థాయిలో మరియు జాతీయస్థాయిలో పలు టోర్నమెంట్ లో పాల్గొని విజయం సాధిస్తున్న అడ్మిన్ సెక్రటరీ రామకూరి రాంబాబు ని విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యాన్చంద్ర హెచ్.యమ్. ఐ.ఏ.ఎస్ అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *