విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు పర్యవేక్షణ కోసం జిల్లాలోని మండల
ప్రజా పరిషత్ లను క్లస్టర్ గా విభజించి క్లస్టర్ సూపర్‌వైజర్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ కె. నివాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తోట్లవల్లూరు, పమ్మిడిముక్కల, ఊయ్యురు, కంకిపాడు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, విజయవాడ రూరల్, మండలాలకు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. కె. మాధవీలతను క్లస్టర్ సూపర్వైజర్ అధికారిగా నియమించారు.
అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, మండలాలకు జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)
కె. మోహన్ కుమార్‌ను క్లస్టర్ సూపర్వైజర్ అధికారిగా నియమించారు.
మైలవరం, ఇబ్రహీంపట్నం, జి. కొండూరు,నందిగామ, చంద్రర్లపాడు,కంచికచర్ల, వత్సవయ,వీరుల్లపాడు,పెనుగ్రంచి ప్రోలు మండలాలకు విజయవాడ సబ్ కలెక్టర్ జి. ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ ను క్లస్టర్ సూపర్ వైజరీ అధికారిగా నియమించారు.
తిరువూరు, గంపలగూడెం, ఏ.కొందూరు, విసన్నపేట, రెడ్డి గూడెం, చాట్రాయి, నూజివీడు, అగిరిపల్లి, ముసునూరు మండలాలకు నూజివీడు ఆర్డీవో కె. రాజ్యలక్ష్మి క్లస్టర్ సూపర్వైజర్ అధికారిగా నియమించారు.
గుడివాడ, పామర్రు, గుడ్లవల్లేరు, నందివాడ, ముదినేపల్లి, పెదపారుపూడి, కైకలూరు, కలిదిండి, మండవల్లి, పెడన, గూడూరు, బంటుమిల్లి, కృతివెన్ను మండలాలకు మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలిని క్లస్టర్ సూపర్వైజర్ అధికారిగా నియమించారు.
రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్‌వైజర్లతో సమన్వయం చేసుకొని కౌంటింగ్ కేంద్రాల్లో జరుగు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను వీరు పర్యవేక్షిస్తారు.