Breaking News

ఆంధ్ర హాస్పటిల్స్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్, యుకె చారిటీ సౌజన్యంతో ఉచిత పిల్లల గుండె సర్జరీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర హాస్పిటల్స్ లో హీలింగ్ లిటిల్ హార్ట్స్, యుకె చారిటీ సౌజన్యంతో 36 వ ఉచిత పిల్లల గుండె సర్జరీలు క్యాంపు నవంబర్ 02 నుంచి 08 వరకు జరిగింది. డాII బోస్కో మోస్కోసో, పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్, సెంట్ జోన్ దె Déయూ బార్సిలోనా హాస్పిటల్, స్పెయిన్, డా. ఐద ఫిలిప్, కన్సల్టెంట్ పిడియాట్రిక్ కార్డియాక్ ఇంటెన్సివిస్ట్, డా. ఐతోర్ లోపెజ్, కన్సల్టెంట్ పిడియాట్రిక్ కార్డియాక్ ఇంటెన్సివిస్ట్, నటాలియా సొరొళ్ల, లారా తదితరులు సెంట్ జోన్ దె Déయూ బార్సిలోనా హాస్పిటల్, స్పెయిన్ నుంచి ఇక్కడకు వచ్చి హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్ర హాస్పిటల్స్ డాII నాగేశ్వర రావు, కార్డియాక్ సర్జన్ తో కలిసి, ఆంధ్ర హాస్పిటల్స్ లో 09 పిల్లల గుండె ఆపరేషన్లు నిర్వహించారు. అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు – కోయర్క్ టేషన్ ఆఫ్ అయోర్టా (COA), రిప్లేస్ మెంట్ ఆఫ్ మైట్రల్ వాల్వ్, సూడో ఎన్యూరిసం, డి ఓ ఆర్ వి + టెట్రాలజి ఆఫ్ ఫాలో (TOF ) మరియు ఇతర క్లిష్టమైన గుండె ఆపరేషన్లు ఈ క్యాంపులో నిర్వహించారు.
గత పది సంవత్సరాల నుండి ఇప్పటివరకు ముఫైఆరు సార్లు ఆంధ్ర హాస్పిటల్స్ కు వచ్చి పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేసారు. మున్ముందు కూడా ఈ రకమైన గుండె ఆపరేషనులు ప్రతి రెండు, మూడు నెలలకొకసారి ఆంధ్ర హాస్పిటల్స్ కు వచ్చి చేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక పిల్లల కార్డియాక్ సర్జరీలు నెలకు 50 నుంచి 60 ఆపరేషన్లు చొప్పున సంవత్సరానికి 600 పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్నాము. ఇప్పటి వరకు 5000 ఆపరేషన్లు పైన మరియు ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేశాము.
నవ్యంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా ఇన్నిపిల్లల గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేయటానికి ఆంధ్ర హాస్పిటల్స్ డా II విక్రమ్ ఆధ్వర్యంలో పిడియాట్రిక్ కార్డియాలజీ టీం, నవజాత శిశువుల మరియు పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్స్ కలిసి చేయటం వలన సాధ్యపడిందని డాక్టర్ పి.వీ.రామారావు చీఫ్ అఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ &డైరెక్టర్ తెలియచేసారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కార్డియాక్ టీమ్ &కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ టీం సహకారంతో ప్రతి రోజు గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియచేసారు. పిల్లల గుండె జబ్బులు వున్న వారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి మన హాస్పిటల్ కు వస్తున్నారని చెప్పారు. ఈ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్ర హాస్పటిల్స్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్, యుకె డాక్టర్లు మరియు నర్సులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియచేసారు.
ఈ క్యాంపు ని ఆంధ్ర మధర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్, మహేష్ బాబు ఫౌండేషన్ మరియు ఎన్ టి ఆర్ వైద్య సేవ సహకారంతో నిర్వహించారు.
డాII విక్రమ్, పిల్లల కార్డియాలజిస్ట్, డా II ఛిస్టీ, పిల్లల కార్డియాలజిస్ట్, డా II నాగేశ్వర రావు, కార్డియాక్ సర్జన్, డాII రమేష్, కార్డియాక్ ఎన్ స్టిటిస్ట్, డాII రఘు రామ్, కార్డియాలజిస్ట్, మరియు డాII తిరుపతి రావు, కార్డియాలజిస్ట్, ఈ విలేఖరుల సమావేశం లో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *