తిరుమల, నవంబర్ 13:
నేటి గురువారం ఉదయం రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 లక్షల గృహాలకు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆ గృహవాసులందరినీ భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పెట్టుబడులు సమకూర్చడం, ప్రతి ఒక్కరికీ ఉద్యోగావకాశాలు కల్పించడం, ప్రతి ఇంటి నుండి ఒక్క పారిశ్రామిక వేత్తను తయారు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించి, మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. వీరందరికీ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని మంత్రి ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News