విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ – 3 పరిధిలోని పిన్నమనేని పాల్లిక్లినిక్ రోడ్ మధర్ దేరిసా జంక్షన్ నుండి లలితా జ్యూలర్స్ వరకు స్ట్రోమ్ వాటర్ డ్రెయినేజి వ్యవస్థ ఏర్పాటు చేయు అంశమును కౌన్సిల్ సమావేశంలో ఎజెండా అంశములలో పొందుపరచుట పట్ల నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ కి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు వై.సి.పి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ. పిన్నమనేని పాల్లిక్లినిక్ రోడ్ అండర్ ఏర్పాటు చేయు విషయమై వై.ఎస్.ఆర్.సి.పి ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ రిప్రజంటేషన్ ను వారి తరుపున ది.15.09.2021 తేదిన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు వై.సి.పి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మేయర్ మరియు కమిషనర్ కు అందించుట జరిగింది. ప్రజల ఇబ్బందులు, సమస్యలను గుర్తించి సదరు అంశమును వెనువెంటనే కౌన్సిల్ సమావేశ ఎజెండా లో పొందుపరచుట పట్ల డిప్యూటీ మేయర్ మరియు ఫ్లోర్ లీడర్ పత్రికా సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …