Breaking News

మహిళా ప్రయాణీకులకు గుర్తింపుకార్డు నిబందనలను తొలగించాలని సి.యం. ని కోరిన ఇ.యు నాయకులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్త్రీశక్తీ పధకం భవిష్యత్ లో మరింతగా విజయవంతం కావాలంటే మూడువేలు బస్సులను పెంచి,పదివేల సిబ్బందిని నియమించాలని,అలాగే మహిళా ప్రయాణీకులలో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రయాణీకులు పెద్దగా లేనందున ఆదార్ కార్డు,ఇతర గుర్తింపు కార్డులు నిభందనలు తొలగించితే కండక్టర్లపై పనిబారం తగ్గుడమే కాకుండా,దీనివలన కూటమి ప్రభుత్వానికి మహిళా ప్రయాణీకులలో ఇంకా మంచి పేరు వస్తుందని విజ్ఞప్తి చేస్తూ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిసిస సందర్బంగా లేఖ ఇచ్చి విజ్ఞప్తి చేసామని ఏపి పిటిడి(ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య, ఉప ప్రధానకార్యదర్శి యం.డి.ప్రసాధ్ సోమవారం ఒక ప్రకటన తెలియజేసారు. అలాగే ప్రభుత్వ పరిధిలో పెండింగు ఉన్న సమస్యలలో ప్రధానంగా ఉన్న సమస్యలు పరిష్కారించాలని ఉద్యోగులకు పిఆర్శీ,డీఏ బకాయిలు చెల్లించాలని, రిటైర్డు ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాడ్యూటీ, లీవ్ డబ్బులు చెల్లించాలని తదితర 10 డిమాండ్లతో లేఖ ఇచ్చామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *