-మరనాత విశ్వాస సమాజ మందిరం పాస్టర్ అల్లూరి విశ్వప్రసాద్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ శాంతి, ఐక్యత, సేవా, సోదర భావాల వ్యాప్తికి చర్చిల పాత్ర ఎంతో కీలకమని మరనాత విశ్వాస సమాజ మందిరం పాస్టర్ అల్లూరి విశ్వప్రసాద్ తో ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గాయత్రి నగర్ , పాలీ క్లినిక్ రోడ్ లోని మరనాత విశ్వాస సమాజ మందిరం పాస్టర్ అల్లూరి విశ్వప్రసాద్ ను బుధవారం ఆయన నివాసంలో ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
“నూతన సంవత్సరం అందరికీ ఆరోగ్యం, శాంతి, సమృద్ధిని తీసుకురావాలి” అని ఆకాంక్షిస్తూ పాస్టర్ అల్లూరి విశ్వప్రసాద్ కు ఎంపీ కేశినేని శివనాథ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరనాత విశ్వాస సమాజ మందిరం చేపట్టే సేవా కార్యక్రమాలకు తన సహకారం వుంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ భరోసా ఇచ్చారు.
కూడా ఎంపీ కేశినేని శివనాథ్ కు పాస్టర్ అల్లూరి విశ్వప్రసాద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో మరింతగా ముందుకు సాగాలని ఆశీర్వదించారు. అనంతరం వీరిద్దరూ సమాజాభివృద్ది, యువతకు నైతిక విలువలు బోధన, సేవా కార్యక్రమాల విస్తరణ వంటి అంశాలపై కాసేపు చర్చించుకున్నారు. ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమానికి తన వంతు మద్దతు అందిస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి క్రిస్టియన్ సెల్ నాయకులు ఇత్తడి చార్లెస్, పాస్టర్ బీర రాజు , ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బన్ కో-ఆర్డినేటర్ వల్లభనేని నరసింహాచౌదరి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News