-ఫ్లెమింగో ఫెస్టివల్ ను పండుగ వాతావరణం లో చేపడుతాం సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 10, 11 తేదీలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ – 2026 ను అత్యంత ప్రజారంజకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.బుధవారం సూళ్లూరుపేట లోని స్థానిక టీవీ ఆర్ఆర్ కళ్యాణ మండపం లో ఏర్పాటుచేసిన ఫ్లెమింగో ఫెస్టివల్–2026 నిర్వహణపై కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు జూ క్యూరేటర్ సెల్వం, సూళ్లూరుపేట శ్రీకాళహస్తి ఆర్ డి ఓ లు కిరణ్మయి, భాను ప్రకాష్ రెడ్డి,పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డా.రమణ ప్రసాద్, డి ఎస్పీ లతో కలిసి కోఆర్డినేషన్ మీటింగు ను నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ…జనవరి 10, 11 తేదీలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ – 2026 ను విన్నూతంగా అందరిని ఆకర్షించేలా, ప్రజారంజకంగా నిర్వహించాలన్నారు. ఈ ఫెస్టివల్ నిర్వహణపై ప్రత్యేక ఫ్లెమింగ్ ఫెస్టివల్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత సంవత్సరం మూడు రోజులపాటు ఫ్లెమింగ్ ఫెస్టివల్ ని జరుపుకోవడం జరిగిందని ఈ సంవత్సరం రెండు రోజులు పాటు ఏడు ప్రాంతాలలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.సూళ్లూరుపేట,నేలపట్టు, బి వి పాల్యం, అటకానితిప్ప, ఇరుకుం ఐలాండ్ ,శ్రీ సిటీ, ఉబ్బలమడుగు జలపాతం తదితర ప్రాంతాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ముఖ్య వేదిక ఉంటుందని, వివిధ స్టాల్స్ , సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా పెద్ద కార్యక్రమని, అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చేపట్టాలన్నారు. గత సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ ను విజయవంతం చేయడం జరిగిందని ఈ సంవత్సరం కూడా రాజకీయ నాయకులు, మీడియా సహకారంతో విజయవంతంగా జరిగేలా సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అందుకు తగిన విధంగా అన్ని శాఖలు తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు..బీవి పాలెంలో అడ్వెంచర్ ఈవెంట్స్, ఏరో స్పోర్ట్స్, హార్ట్ ఎయిర్ బెలూన్స్ ప్లాన్ చేస్తున్నామన్నారు.ఇరుకం నందు బోటింగ్ ఏర్పాటుతో పాటు లైఫ్ జాకెట్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ పర్యాటక ప్రాంతాలలో అవసరమైనరోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని అటకాని తిప్ప పర్యాటక ప్రాంతం వద్ద వ్యూ పాయింట్స్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
జనవరి,2026 10, 11 వ తేదీలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ ను పండుగ వాతావరణంలో చేపడుతామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. గతంలో నిర్వహించిన ఉత్సవాన్ని అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించామని అదే రీతిలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ను అధికారులందరూ అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. నేలపట్టు,బీవీ పాలెం వద్ద మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News