Breaking News

డీఎల్టీసీ స్టాఫ్ అసోసియేషన్ క్యాలెండర్‌ ఆవిష్కరన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ప్రభుత్వ ఐటీఐ మరియు డీఎల్టీసీ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ బుధవారం అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దీనికి స్పందించిన ప్రధాన కార్యదర్శి ఈ అంశంపై సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, డిపార్ట్మెంట్‌లోని రెగ్యులర్ ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించిన అంశంపై కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ప్రధాన కార్యదర్శి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు పుట్టగుంట రమేష్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కృష్ణ కిషోర్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు గొంది హరి ధర్మేంద్ర, కాంట్రాక్ట్ స్టాఫ్ రాష్ట్ర అధ్యక్షులు పి. కిషోర్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *