-డివిపివో వి. శాంత మణి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి, రాజమహేంద్రవరం, రాజానగరం, కడియం, కొవ్వూరు మండలాల్లో ప్రతి మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని “స్వచ్ఛ రథం” నిర్వహణకు అర్హులైన వ్యక్తులు, సంస్థలు, స్క్రాప్ డీలర్లు, వాహన ఆపరేటర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి. శాంత మణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మండలానికి విడివిడిగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రకటన విడుదలైన తేదీ (1.1.2026) నుంచి ఏడు రోజుల్లోపు దరఖాస్తులు అందజేయాల్సిందిగా సూచించారు.
ఈ కార్యక్రమానికి వర్తించే గరిష్ట వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మోడల్–I : నెలకు రూ.25,000, మోడల్–II : నెలకు రూ.21,000 గా నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.
దరఖాస్తు చేసుకోవడం కోసం నిర్దేశించిన అర్హతలు స్క్రాప్ డీలింగ్, ఘన వ్యర్థాల సేకరణ లేదా పునర్ వినియోగ పరచదగిన పదార్థాల నిర్వహణలో కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలని, అలాగే సంబంధిత ట్రేడ్ లైసెన్సు / రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు.
దరఖాస్తుతో పాటు ఆధార్, పాన్ కాపీలు, నివాసం లేదా సంస్థ రిజిస్ట్రేషన్ రుజువు, అనుభవ ధృవీకరణ పత్రాలు, స్క్రాప్ డీలింగ్ / MRF ఆపరేషన్‌కు సంబంధించిన ట్రేడ్ లైసెన్సు, GST రిజిస్ట్రేషన్ (వర్తిస్తే),
గత మూడు సంవత్సరాల టర్నోవర్ స్టేట్‌మెంట్‌లు, ఐటి రిటర్నులు, స్వచ్ఛ రథం నిర్వహణకు ప్రతిపాదిత వాహనం వివరాలు (RC, డ్రైవింగ్ లైసెన్సు, కాలుష్య, బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికేట్),
బ్యాంక్ పాస్‌బుక్ కాపీ ప్రతులను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఉమ్మడి నిర్వహణ వివరాలు (వర్తిస్తే),.వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం ప్రతిపాదిత నెలవారీ మొత్తం (మోడల్–I కి రూ.25,000 మించరాదు, మోడల్–II కి రూ.21,000 మించరాదు),
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంప్రదింపు వివరాలు జత చేయాల్సి ఉంటుందని తెలిపారు.
దరఖాస్తుతో పాటు రూ.10,000 డిమాండ్ డ్రాఫ్ట్‌ను సంబంధిత MPDO పేరుతో సమర్పించాల్సి ఉంటుందని, ఈ మొత్తం తిరిగి చెల్లించబడదని వెల్లడించారు.
దరఖాస్తులను ఆమోదించుటకు, తిరస్కరించుటకు లేదా వాయిదా వేయుటకు జిల్లా పంచాయతీ అధికారి మరియు కన్వీనర్‌కు పూర్తి అధికారాలు ఉన్నాయని తెలిపారు.
ఇతర వివరాలకు పరిపాలనాధికారి (మొబైల్: 9441095429), జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, రాజమహేంద్రవరంను సంప్రదించాలని సూచించారు.
Prajavartha Online Telugu News