Breaking News

నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరికి పలువురు శుభాకాంక్షలు

-ప్రభుత్వ పథకాలు–అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిబద్ధత అవసరం
-కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరిని జిల్లా అధికారులు, సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, జిల్లా ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తాను ఇచ్చిన పిలుపు కు స్పందించి నోట్ పుస్తకాలు , విద్యార్థులకి ఉపయోగ పడే పుస్తకాలు అందచేయడం పట్ల అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నూతన సంవత్సర సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికారులు మరింత నిబద్ధతతో, జవాబుదారితనంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, అవి అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకతతో పాటు వేగం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్‌ను ఆయన ఛాంబర్‌లో పలువురు అధికారులు, అనధికారులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *