Breaking News

క్రమశిక్షణ , నిబద్దత, అంకితభావంకు నిలువెత్తు నిదర్శనం నాదెండ్ల‌ బ్రహ్మం చౌదరి

-ఎంపీ కేశినేని శివ‌నాథ్
-బ్ర‌హ్మం చౌద‌రి తో పాటు కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ల కి ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభినంద‌న‌లు
-రాష్ట్ర‌ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎంపీ హాజ‌రు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
గ‌త ప్ర‌భుత్వ దుర్మార్గ పాల‌న‌కు వ్య‌తిరేకంగా ధైర్యంగా పోరాడ‌ట‌మే కాకుండా.. తెలుగుదేశం పార్టీ ని అంటి పెట్టుకుని పార్టీ నాయ‌కులకు అండ‌గా నిలిచిన వ్య‌క్తి నాదెండ్ల బ్ర‌హ్మం చౌద‌రి. క్రమశిక్షణ , నిబద్దత, అంకితభావంకు నిలువెత్తు నిదర్శనం నాదెండ్ల‌ బ్రహ్మం చౌదరి అంటూ ఎంపీ కేశినేని శివ‌నాథ్ కొనియాడారు.
రాష్ట్ర‌ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్య‌క్ర‌మం శ‌నివారం తాడేప‌ల్లిలోని ఎస్.ఆర్.క‌న్వేన్ష‌న్ లో అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్.స‌విత‌, స్వ‌చ్చాంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్, విజ‌యవాడ దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ల‌తో కలిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ రాష్ట్ర‌ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ప్ర‌మాణాస్వీకారం చేసిన నాదెండ్ల బ్ర‌హ్మం చౌద‌రి తో పాటు పాల‌క‌వ‌ర్గ స‌భ్యుల‌కు శుభాభినంద‌న‌లు తెలిపారు.
ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మ‌యంలో నాదెండ్ల బ్ర‌హ్మం చౌద‌రి యువ‌నేత నారా లోకేష్ వెన్నంటే వుండి పాద‌యాత్ర మొత్తం ముందుండి న‌డిపించాడ‌న్నారు. ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొని పార్టీ నాయ‌కుల‌కు అండ‌గా వున్నాడని గుర్తు చేశారు. క‌మ్మ సామాజిక వ‌ర్గంలో కూడా ఎంతో మంది పేదవారు వున్నార‌ని…వారి సంక్షేమం, అభివృద్ది కోసం కృషి చేయాల‌ని సూచించారు. బ్ర‌హ్మం చౌద‌రి కి అన్ని విధాలుగా అండ‌గా, తోడుగా వుంటామ‌న్నారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్నీ ఉన్న‌త‌మైన ప‌దువులు అల‌క‌రించి ఆకాంక్షించారు. నాదెండ్ల బ్రహ్మం చౌద‌రికి ఈ అవ‌కాశం క‌ల్పించిన‌ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *