Breaking News

సమాచార శాఖ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత, అనురాగాలను పెంచి నూతనోత్సాహంతో ముందుకు సాగుతూ, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మరిన్ని విజయాలను సాధించాలని సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణలత ఆకాంక్షించారు..
సమాచార పౌర సంబంధాల శాఖ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎన్టీఆర్ పరిపాలనా భవనం రెండో అంతస్ధు డైరెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగులు సాంప్రదాయ దుస్తులతో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయబద్ధంగా రంగోలీ ముగ్గులు, రంగవల్లులు, చెరకు గడలు, బొమ్మల కొలువు, భోగిపళ్లు, గాలిపటాలు, సాంప్రదాయ బంతిపూలతో కార్యాలయాన్ని పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా అలంకరించారు.

ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు స్వర్ణలత మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ఉత్సాహం ప్రతి ఉద్యోగి కుటుంబంలోనూ ఆనందంతో వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. తన చిన్ననాటి సంక్రాంతి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టడం, తెల్లవారుజామున భోగి మంటలు వేసుకుని చలి కాచుకుంటూ సంబరాలు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉండేదని అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణలత తెలియజేశారు.

జాయింట్ డైరెక్టర్ కె. కిరణ్ కుమార్ మాట్లాడుతూ… సంక్రాంతి అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించే శుభ సందర్భమని, దీనివల్ల ఋతువుల్లో మార్పులు, కొత్త పంటలు, కుటుంబ సభ్యుల కలయిక జరుగుతాయని వివరించారు. సంక్రాంతి పండుగకు మన తెలుగు సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉందని, ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ తమ జన్మభూమిని చేరుకుని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే పండుగ సంక్రాంతేనని పేర్కొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ కొత్త సంప్రదాయం భవిష్యత్తులోనూ కొనసాగాలని జాయింట్ డైరెక్టర్ కె. కిరణ్ కుమార్ ఆకాంక్షిస్తూ ఉద్యోగులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఛీప్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఓ. మధుసూధన్ మాట్లాడుతూ.. సంక్రాంతి నుండి సూర్యుడు ఉత్తరం వైపు మళ్లడం (ఉత్తరాయణం) ఒక శుభ సూచకమని అన్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల కలయికతో ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఐ. సూర్యచంద్రరావు, ఆర్ఐఈ డాక్టర్. టి. నాగరాజ, డిప్యూటీ డైరెక్టర్లు బి. పూర్ణచంద్రరావు, పి. వెంకట్రాజ్ గౌడ్, డి. రమేష్, అసిస్టెంట్ డైరెక్టర్లు పి. రాజశేఖర్, ఏఎస్ వీరభద్రరావు, కే. నారాయణ రెడ్డి, ఎస్వీ మోహన్ రావు, ఏవో పి. సుదర్శనరావు, జేఈవో నాగరాజు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నగరంలో శ్రీవిద్య లగ్జరీ షోరూమ్ ప్రారంభం

విజయవాడ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *