Breaking News

అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని, ఆహారం సరఫరా అనంతరం శుభ్రం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం నల్లచెరువు లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, కొందరు క్యాంటీన్ లోపల స్థలం సరిపోక కాంపౌండ్ లోపల కూర్చొని భోజనం చేస్తున్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. లైటింగ్, ఫ్యాన్ల ఏర్పాటు, ఎక్కడైనా మరమత్తులు ఉంటే వెంటనే చేపట్టాలన్నారు. ఆహార సరఫరా అనంతరం ప్రాంగణం శుభ్రం చేయాలని అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. ప్రతి రోజు ప్రభుత్వ నిర్దేశిత సమయంలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *