Breaking News

ప్రజారోగ్య ప్రాజెక్టు సంజీవని చిత్తూరుకు విస్తరణ

-సీహెచ్‌సీలో డిజి నెర్వ్ సెంటర్‌ను ప్రారంభం
-నీవా బ్రాంచ్ కెనాల్ పనులకు సీఎం శంకుస్థాపన
-నారావారిపల్లెలో స్కిల్ బిల్డింగ్ సెంటర్ సహా వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం
-సంక్రాంతి పండుగ వేళ స్వగ్రామం, తిరుపతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

నారావారిపల్లె, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్య ప్రాజెక్టు సంజీవనిని చిత్తూరు జిల్లాకు విస్తరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిజినెర్వ్ సెంటర్ సేవల్ని ప్రారంభించారు. గత ఏడాది కుప్పంలో పైలట్ గా ప్రారంభించిన డిజి నెర్వ్ సెంటర్ డిజిటల్ హెల్త్ రికార్డుల సేవల్ని చిత్తూరు జిల్లాకు కూడా విస్తరించారు. తదుపరి దశలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సంజీవని ప్రాజెక్టును విస్తరించేలా డిజినెర్వ్ సెంటర్ సేవల్ని ప్రారంభించారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబ సభ్యులతో సహా నారావారిపల్లెకు వెళ్లిన సీఎం ఇవాళ స్వగ్రామం సహా తిరుపతిలలో వేర్వేరు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నారావారిపల్లెలో రూ.4.27 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌ స్టేషన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే స్వగ్రామంలో యువత నైపుణ్యాలు పెంచేలా రూ.1.4 కోట్ల తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. దీంతో పాటు రూ.77 లక్షలతో ఎ.రంగంపేట – భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకూ నిర్మించిన నూతన రహదారిని కూడా సీఎం ప్రారంభించారు. 30 పడకల నుంచి 50 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైంది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో రూ.45 లక్షలతో నిర్మించిన పేషెంట్ అటెండెంట్ అమినిటీస్ కాంప్లెక్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. శ్రీవేంకటేశ్వరా యూనివర్సిటీ లో రూ.7.5 కోట్లతో నిర్మించిన యూత్ హాస్టల్, రూ.5 కోట్లతో నిర్మించిన మహిళా హాస్టల్ ను సీఎం ప్రారంభోత్సవం చేశారు.

నీటి తరలింపు ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

నారావారిపల్లె సమీపంలో రూ.126 కోట్లతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్ కు, మూలపల్లి చెరువు సహా మరో 4 చెరువులకు నీటిని తరలించే పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న పశువుల వసతి నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఎస్వీ యూనివర్సిటీలో పరిశోధన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా రూ.6 కోట్లతో కేంద్రీకృత పరిశోధనా ల్యాబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.5.03 కోట్లతో అకడెమిక్ బిల్డింగ్ 2వ అంతస్తు నిర్మాణానికి, రూ.2.91 కోట్లతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *