Breaking News

తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ‌

-ప్రజలకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ సంక్రాంతి శుభాకాంక్ష‌లు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, ఐక్యత, సుఖసంతోషాలు నింపాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షిస్తూ….విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో పాటు తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప‌త్రిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

.సంక్రాంతి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఆశలు, ఆశయాలు, సానుకూల మార్పులు తీసుకురావాలి.
ప్రత్యేకంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంక్రాంతి పండుగ ఎంతో ప్రాముఖ్యత కలిగినదని, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు పేదలు, రైతులు, మహిళలు, యువతకు మేలు చేస్తున్నాయని తెలిపారు.

వ్యవసాయ రంగం, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పన, విద్య, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల రాష్ట్రం వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు.

ఈ సంక్రాంతి పర్వదినాల్లో ప్రజలందరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని, ప్రతి ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించే దిశగా ప్రజల సహకారం ఎప్పటికీ అవసరమని ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *