Breaking News

ముస్లిం ఆస్తుల నష్టానికి వక్ఫ్ అధికారులే కారణం

-అన్యాక్రాంతాలపై ముఖ్యమంత్రికి వివరిస్తే ప్రభుత్వ ఖాజీ ని సస్పెండ్ చేయడం దారుణం
-రాష్ట్ర అహలె సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అంజుమన్, ఖాజీ,మసీదు దర్గా భూములన్నీ ముస్లిం మైనార్టీ భూములని ఆ తర్వాతే అవి వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తాయని అన్నారు రాష్ట్ర అహలె సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా. ముస్లిం మైనార్టీల భూములు అన్యాక్రాంతమవుతున్నయని ముఖ్యమంత్రి కలిస్తే వక్ఫ్ అధికారులు కక్ష సాధింపు చర్యలో భాగంగా జిల్లా ప్రభుత్వ ఖాజీ హబీబుల్లా హుస్సేని ను సస్పెండ్ చేయటం దారుణమని తెలిపారు. వేల కోట్ల ఆస్తులు ఉండి కూడా ముస్లింలు పేదరికంలో ఉండటానికి కారణం ఎవరిని ప్రశ్నించారు. కనీసం ఇల్లు లేక, ముస్లింలంటే అద్దె ఇల్లు లభించగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా ముస్లిం మైనార్టీల తలరాతలు మాత్రం మాట్టంలేదని తెలిపారు. ముస్లిం మైనార్టీల రక్షణ కోసం ఏర్పడిన వక్ఫ్ సంస్థ మైనార్టీ భూములు ఇష్టానుసారంగా ఎక్వేర్ పేరుతో అన్యాక్రాంతం అవుతుంటే వక్ఫ్ సంస్థ లో బాధ్యత గల వ్యక్తులు మౌనం వహించడంలో ఆంతర్యం ఏమిటని దుయ్యబట్టారు.విజయవాడ పోరంకి సీతారాంపురం, నారాయణపురం కాలనీ 50 ఎకరాలు కేవలం 80 వేలకు ఎకరం చొప్పున రాఘవ ఎస్టేట్ కు, నిడమనూరు ఖాజీ మన్యం అతి తక్కువ ధర ఎకరం 6 లక్షలకు 40 ఎకరాలు ధారధత్వం చేసింది ఎవరని అన్నారు.
తాడిగడప ఖాజీ మన్యం భూములకు ఎన్వోసీ అధికారులు ఎందుకు ఇచ్చారని,మైనార్టీ భూములు అతి తక్కువ ధరకు తీసుకొని కోట్ల రూపాయలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు దారుణం జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వాలు తీసుకున్న వక్ఫ్ భూముల వలన మైనార్టీలకు ఏమైనా లాభం జరిగిందా..? పరిశ్రమలు నిర్మించి ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇచ్చారా..?మా భూములు తీసుకుని వ్యాపారాలు చేసుకొని కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించవచ్చు మైనార్టీలు మాత్రం పకీర్లుగా మిగిలిపోవాలి ఇదేనా ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు.
మా హాక్కుల కోసం మా భూములు కాపాడుకోవడం కోసం రోడ్డు మీదకు వచ్చి ఉద్యమాలు చెయ్యాలా? ఈ దుర్మార్గం ఎందుకు ఇంత వివక్ష దేనికి, ఆదాయం వచ్చే దర్గాలన్నీ వక్ఫ్ చేతిలో ఉన్న మాట వాస్తవం కాదా. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కోసం ముతవల్లిలను సస్పెండ్ చెయ్యటం మీ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసమేనా అని సమాధానం చెప్పాలన్నారు.ముస్లింలను అణచివేసే విధానం కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *