అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 20 న జరిగే కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం విజయవంతం చేయాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో డూండి రాకేష్ మాట్లాడుతూ… కన్యకాపరమేశ్వరి అమ్మవారికి గౌరవం దక్కితే ఆ గౌరవం ఆర్యవైశ్యులందరికి దక్కినట్లే. గత వైసిపి హయాంలో దేవాదాయ శాఖ మంత్రి గా ఉండిన వ్యక్తి వైశ్యుల కోసం గాని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాల అభివృద్ధి కి గాని ఏమి చేయలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆర్యవైశ్యుల కోరికను మన్నించారు.అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా మార్చారు.కాబట్టి ఆర్యవైశ్యులందరు కూడా మీ స్థానిక ప్రభుత్వ నాయకులను అధికారులను కార్యక్రమానికి పిలిచి వారు కార్యక్రమంలో పాల్గొని వాసవి అమ్మవారి ఆశీస్సులు తీసుకునే విధముగా చెయ్యండి. అంతేకాకుండా వాసవి అమ్మవారి జన్మస్థలం పెనుగొండ ను వాసవి పెనుగొండగా మార్చారని అన్నారు డూండి రాకేష్
Prajavartha Online Telugu News