Breaking News

అన్నక్యాంటీన్లలో ఆహార సరఫరా నిర్దేశిత సమయపాలన పాటించాలి… : నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అక్షయపాత్ర

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో ఆహార సరఫరా నిర్దేశిత సమయపాలన పాటించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. గురువారం చుట్టగుంట సెంటర్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో ప్రతి రోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ తెచ్చుకోవాలని, ఏ ఒక్కరికీ ఆహారం అందలేదనే ఫిర్యాదు రాకుడదన్నారు. క్యాంటీన్ లో ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయడానికి ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ని అందరికీ కనిపించేలా ఉంచాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *