Breaking News

ఎస్ఆర్కె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నందు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ మై భారత్ కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో ఈరోజు గన్నవరం నియోజవర్గం ఎనికెపాడు ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెమినార్ హాల్ నందు నేతాజీ జయంతి సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని ఎన్ఎస్ఎస్ యూనిట్ తో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు సుభాష్ చంద్రబోస్ పటానికి పూలమాలలు అర్పించి కార్యక్రమమును ప్రారంభించారు. మైభారత్ జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి స్వాతంత్రం కోసం పోరాటమే ఆయుధమని విరోచితంగా సైనికులు తయారుచేసి స్వాతంత్ర్యం రావడంలో తన వంతు పాత్రను వహించిన సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆ మహానీయుడిని స్ఫూర్తిగా తీసుకుని యువత అంతా ముందుకు వెళ్లాలని అన్నారు
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న జిల్లా యువజన సంక్షేమ శాఖ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో మాట్లాడవలసిన వారిలో ముందు వరుసలో సుభాష్ చంద్రబోస్ ఉంటారని ఆయన చేసిన సేవలు స్వాతంత్రం రావడంలో ఆయన చేసిన పోరాటం ఎంతో ప్రాముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె రమేష్ ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి చిన్ని మరియు విద్యార్థులు యువత పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *