గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జూన్ 30, 2025 లోపు ఏర్పాటైన అనధికార, అక్రమ లే ఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి దరఖాస్తులు అందించడానికి మరో 3 నెలలు కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఆర్టీ నం.49 ద్వారా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, అర్హత కలిగిన ప్లాట్ల కొనుగోలుదారులు, లే అవుట్ యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్ని అనధికార లే అవుట్ లను ప్రణాళిక చట్రంలోకి తీసుకురావడం కోసం, ప్రణాళికాబద్ధమైన పట్టణ వృద్ధిని నిర్దారించడమనే లక్ష్యాన్ని సాధించడానికి ఎల్ఆర్ఎస్ పధకం అమలుకు దరఖాస్తులను అందించడానికి ఈ ఏడాది ఏప్రిల్ 23 వరకు గడువుని ప్రభుత్వం పొడిగించిందని తెలిపారు. కనుక గుంటూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు అనంతరం అనధికార లే అవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News