-ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఎన్నికల కమిషన్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి వై. మేఘా స్వరూప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం రాజమహేంద్రవరం వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు, కొత్తగా నమోదు అయిన ఓటర్లకు అభినందనలు, ప్రజాస్వామ్య విలువలపై సందేశాలు ఇవ్వబడతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జాతీయ ఓటరు దినోత్సవ థీమ్ “నా భారతదేశం – నా ఓటు” గా నిర్ణయించబడిందని తెలిపారు. ప్రతి పౌరుడు తన ఓటు హక్కు విలువను గుర్తించి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News