విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిట్టినగర్ లో వెలసిన శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో బాలాత్రిపురసుందరిదేవి రూపంలో అమ్మవారిని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ జనసేన పార్టీ నాయకులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి ప్రెసిడెంట్ లింగిపిల్ల.అప్పారావు, సెక్రటరీ మరుపిల్ల.హనుమంతరావు మరియు కోశాధికారి పిళ్ళ.శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యులు మహేష్ ని ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించిన అనంతరం ఆలయ ప్రాంగణం లో శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ అర్బన్ నాయకులు మరియు ధార్మిక సేవ మండలి సభ్యులు కొరగంజి.రమణ, వేవిన.నాగరాజు, తమ్మిన.రఘు, శివరామకృష్ణ, దుర్గా రాణి, బొట్ట.సాయి, మూర్తి, కొండ, పొట్నురి. శ్రీను, సోమశేఖర్, నూకరాజు, వెంకటేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
శుక్రవారం జిఎంసిలో పట్టణ ప్రణాళిక ఓపెన్ ఫోరం… : కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళిక అంశాలపై అర్జీలు, ఫిర్యాదులు, సమస్యల …