మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 26 సోమవారం ఉదయం మంగళగిరి భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాను ఆవిష్కరించి మన దేశ మహనీయులకు నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకుంటూ భారత దేశ రాజ్యాంగ స్ఫూర్తిని పొందారు.
అనంతరం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వాతంత్ర్యాన్ని తెచ్చుకోగలిగాము గాని మనదేశంలో ఉన్న కొన్ని అగ్రవర్ణాల నుంచి అనగారిన వర్గాలకు స్వాతంత్ర్యం వచ్చింది తీసుకురాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కూడా కొన్ని వర్గాల ప్రజలు చట్టసభలలో అడుగుపెట్టలేదని, అన్ని వర్గాల ప్రజాప్రతినిధులు చట్టసభలలో అడుగుపెట్టాలని వ్యాఖ్యానించారు. బీసీవై పార్టీ అనేది ఏ ఒక్క వర్గానికి కులానికి మతానికి సంబంధించిన పార్టీ కాదని అగ్రకులాల పేదలకు, బీసీ, ఎస్సీ, ఎస్టి, బడుగు బలహీన వర్గాల అందరినీ కలుపుకొని సామాజిక సమానత్వం సాధించే దిశగా ముందుకు సాగుతున్న పార్టీ అని, బీసీల రక్షణ కోసం చట్టాన్ని తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీసీవై పార్టీ అని తెలియజేశారు. అందులో భాగంగా ఫిబ్రవరి 22న బీసీ మహాగర్జన సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా జనగణనతో పాటు కులగణన కూడా చేసిన తర్వాత మాత్రమే స్థానిక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలియజేశారు. జనాభా దామాషా ప్రకారం వారి వారి నిష్పత్తిని బట్టి సీట్ల కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు, ప్రతీ ఉప కులానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది కానీ వారి అభివృద్ధికి సంబంధించి నిధులను కేటాయించడంలో, విడుదల చేయడంలో విఫలం అయిందని అన్నారు. ఆయా కమీషన్ల అభివృద్ధికి కావాల్సిన నిధులను వెంటనే సమకూర్చాలని డిమాండ్ చేశారు. చట్టసభలలో సీట్లను కేటాయించే విషయంలో బీపీ మండల్ సిఫారసులను పరిగణలోకి తీసుకోవాలని అదేవిధంగా రాజధాని అమరావతిలో బీపీ మండల్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్మృతి వనంగా అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏ మూలన అణగారిన వర్గాల వారికి అన్యాయం జరిగినా ముందుగా స్పందించి వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేసే ఏకైక వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ అని అన్నారు. అదేవిధంగా తరతరాలుగా వస్తున్న ఈ వారసత్వపు రాజకీయాల నుంచి రాష్ట్ర ప్రజలను విముక్తి చేసి అందరికీ సుపరిపాలన అందించే ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ భారత చైతన్య యువజన పార్టీ అని వ్యాఖ్యానించారు.
ఆకుల జయ కళ్యాణి సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తోట శివరాం ప్రసాద్, చాముండేశ్వరీ దేవి, తోకల రామకృష్ణ, వి.ఎస్.ఎన్. ప్రసాద్, మట్టా శివ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News