Breaking News

ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన పుస్తకాలు

-ముందుకొచ్చిన ఎమెస్కో విజయకుమార్…అభినందించిన సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన ప్రచురణలను అందించేందుకు ఎమెస్కో సంస్థ ముందుకొచ్చింది. ఎమెస్కో విజయకుమార్ సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబును కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రంలోని గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన ప్రచురణలను విరాళంగా అందించేందుకు తమ సంస్థ పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లు విజయకుమార్ తెలిపారు. ఈమేరకు పుస్తకాల జాబితాను సీఎంకు అందించిన విజయకుమార్…గ్రంథాలయాలకు ప్రచురణలు చేరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేలా ఆ సంస్థను ఆదేశించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమెస్కో విజయకుమార్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. గ్రంథాలయాలు సమాజంలో జ్ఞాన విస్తరణకు కీలక పాత్ర పోషిస్తున్నాయని, పుస్తకాలు పంచడం అంటే జ్ఞానాన్ని పంచినట్లేనని అన్నారు. ప్రచురణల వితరణ ద్వారా విద్యార్థులు, ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *