Breaking News

ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించండి..

-పరిసరాల పరిశుభ్రతమై ప్రత్యేక దృష్టి పెట్టండి..
-డ్రైనేజిలపై అక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోండి…
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టకుని ప్రజలకు స్వచ్చమైన త్రాగునీటిని అందించాలని పరిసరాల పరిశుభ్రతమై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు డ్రైనేజిలపై అక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కొండపల్లి మునిసిపాలిటీలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర ఏ 2047 సాలాలానికి ప్రతిఒక్కరూ అడుగులు కలపాలన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి దూరంగా ఉండేలా ప్రజలను చైతన్యవంతులను చేసి పర్యవరణం పరిరక్షణలో భాగస్వాములు చేయాలన్నారు. పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొండపల్లి 16వ డివిజన్ దేవుడుమాన్యంలో త్రాగునీటి పైపు లైన్లో లో లీకేజ్ ల కారణంగా త్రాగునీరు కాలుష్యతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక కార్పొరేటర్ తన దృష్టికి తీసుకువచ్చారని తక్షణమే పైపులైన్ మరమత్తు పనులు చేయాలని సిసి రోడ్లు నిర్మాణానికి కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి సిసి రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించామన్నారు. కొండపల్లి ప్రాంతంలో కుక్కల బెడద నివారించేందుకు ప్రభుత్వ స్థలాన్ని సేకరించి ప్రత్యేక షెడ్ను ఏర్పాటు చేసి కుర్కలను తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైనేజిలపై అక్రమణల వలన మురుగునీటి పారుదలకు ఆటంకం కలుగుతుందని తక్షణమే అక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వినూత్న ఆలోచనల ద్వారా పరిసరాలు, నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగించుకుంటూ స్వయం ఉపాధి, వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వివరించారు.

జిల్లా కలెక్టర్ పర్యటనలో కొండపల్లి ఇన్చార్డ్ మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరరావు, శానిటరి ఇన్స్పెక్టర్ మధు, 16వ డివిజన్ కార్పొరేటర్ ధరణికోట విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *