Breaking News

మహిళల ఆర్థిక పురోభివృద్దే ప్రభుత్వం లక్ష్యం…

-జిల్లాలో వైఎస్సార్ ఆసరా రెండోవిడతగా 7.35 లక్షల మంది మహిళలకు వైఎస్ఆర్ రూ. 673 కోట్లు పంపిణీ…
-జిల్లాలో వైస్సార్ ఆసరాతో అభివృద్ది దిశగా మహిళా సంఘాలు…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేను ఉన్నాను… నేను విన్నాను అంటూ నాడు సుదీర్ఘ పాదయాత్రలో ప్రజా సమస్యలు అతి దగ్గర నుంచి తెలుసుకోవడమే కాకుండా ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచి నాడు ప్రజలకిచ్చిన హామీలను నేడు నేరవేర్చుతున్న ప్రజలు మెచ్చిన నేత ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఈ దిశగా జిల్లాలో రెండో విడతగా వైఎస్ఆర్ ఆసరా కింద్ర జిల్లాలోని నగర, పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లోని 73,852 స్వయ సహాయ సంఘాల్లో 7.35 లక్షల మంది మహిళా సభ్యులకు రూ.673 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా సంఘ సభ్యులకు రుణ మాఫీ అమలు చేయక పోవడంతో అప్పుల ఊభిలో కూరుకుపోయి ‘ఏ’ గ్రేడ్ గా ఉన్న సంఘాలు ‘సీ’, ‘డీ’ గ్రేడ్ లకు దిగజారాయి. మరి కొన్నిసంఘాలైతే నిర్వహించలేక మూత పడే స్థితిలో కొచ్చాయి. ఇటువంటి తరణంలో సీయం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం మేరకు మహిళలకు ఆసరా కల్పిస్తూ వారి ఆర్థిక పురోగతికి శ్రీకారం చుట్టారు. మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా మొదటి విఢతలో రూ.6,319 కోట్లు ఆసరా కల్పించగా నేడు రెండవ విడతగా రూ.6,440 కోట్లు మొత్తం రెండు విడతల్లో రూ.12,759 కోట్లు పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేయడం చరిత్రాత్మకం. 2016 సం.రంలో గత ప్రభుత్వం రద్దు చేసిన సున్నా వడ్డీ పథకాన్ని పురుద్దరించి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా 9.41 లక్షల స్వంయం సహాయక సంఘాల్లోని 98 లక్షల మంది అక్కా చెల్లెమ్మల ఖాతాలకు రెండేళ్ళలో రూ. 2,362 కోట్లు జమ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే. పాలకులు వస్తారు.. వెళతారు కాని పేద ప్రజల గుండేల్లో చిరస్థాయిగా మిగినవారే నిజమైన పాలకులనడానికి ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న ఆసరా వంటి పథకాలే నిదర్శనం. గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా డ్వాక్రా మహిళా సభ్యులను మోసం చేయగా నేడు సీయం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం మేరకు నాలుగు విడతలు వైఎస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేస్తూ మహిళల ఆర్థిక పురోభివృద్దికి భరోసాను కల్పించారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యంతో చేస్తున్నారు. మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు, ఇబీసీ నేస్తం పథకం, కాపు కార్పోరేషన్ కింద అర్హువైన ప్రతి అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తు పెద్ద పీట వేస్తోంది.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మహిళలకు ఆర్థిక స్వావలంబనను కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళల ఆర్థిక పురోభివృద్దికి చేయూతనందింస్తుంది. చేయూత పథకం ద్వారా ఆర్థికంగా బలో పేతం చెందిన లబ్దిదారుల మాటల్లోనే విందాం.. చేయూత మాకు కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించిందంటున్నారు కైకలూరు గ్రామనికి చెందిన మణికాంతం పేద కుటుంబానికి చెందిన మహిళ. వీరికి చదువు లేకపోయిన వీరి ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు. తన భర్త ఎరువులు షాపులో గుమస్తాగా పనిచేస్తూ చాలి చాలని జీతంతో పిల్లల చదువుతో కుటుంబ పోషణ జరగ్గ ఆర్థిక ఇబ్బందులుకు గురువతున్న తరణంలో ప్రభుత్వం స్త్రీ నిధి నుంచి రూ. 50 వేల రూపాయులు అర్థిక సహాయన్ని అందించింది. దీంతో చిన్న పాటి పచ్చళ్ల వ్యాపారం, దీనికి తోడు కూల్ డ్రింక్స్, పాలు, పెరుగు వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. వ్యాపారం మొదలు పెట్టిన తరువాత కొంచెం కొంచెం లాభాలు కూడా వస్తున్నాయని, పిల్లలకు కావలసిన దుస్తులు,కుటుంబ పోషణకు అవసరమయ్యే సరుకలు వచ్చిన లాభాలతో కొనుక్కోగలుగుతున్నారమమని వివరించారు. షాపు పెంచుకోవాలని ఉందని ప్రభుత్వం రూ. లక్ష రూపాలయల వరకు రుణాన్ని అందింస్తే మా షాపును మరింత అభివృద్ది చేస్తామని, వైస్సార్ ఆసరాగా రెండవ విడత రూ. 9 వేలు ఖతాలో జమఅయ్యిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు.
కైకలూరు గ్రామనివాశులు వి.గంగానమ్మ వివరిస్తూ తనకు బ్యాంకు లింకేజిగా రూ. 50 వేలు, వైఎస్సార్ తొలి, మలి విడతల్లో రూ,16వేలు,స్తీ నిధి నుంచి మరో రూ.20 వేలు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించిందని దీంతో పచ్చళ్ల వ్యాపారం, అగర బత్తి వ్యాపారం ప్రారంబించామని, గతంలో కంటే నేడు మా ఆర్థిక పరిస్థితులు మెరుగు పడ్డాయన్నారు. మాలాంటే పేద మహిళలకు ఆర్థిక చేయూత నందిస్తున్న సీయం జగన్మోరెడ్డి జీవితాంతా కృతజ్ఞతతో ఉంటామని వారు సంతోషాన్ని వ్యక్తపరిచారు.
రాష్ట్ర ప్రభుత్వం 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు వై.యస్.ఆర్ చేయూత పథకం ప్రకటించడం, ఆ పథకానికి ఆదమ్మ అర్హత కలిగి ఉండటంతో దరఖాస్తు చేసింది. అర్హతలు అన్ని సరిపడటంతో గత ఏడాది రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మొదటి విడత వై.యస్.ఆర్ చేయూత పథకం క్రింద రూ.18,750 తమ ఖాతాలో జమ అయింది. దీంతో ఆదెమ్మ వానపాముల గ్రామంలోనే కిరాణా షాపును ప్రారంభించింది. గతంలో భర్తతో పాటు తను కూడా కూలీపనులు చేస్తున్నా చాలిచాలని ఆదాయంతో కుటుంబ ఫోషణ భారంగానే ఉండేది. కుటుంబ పోషణ నిమిత్తం గతంలో కూలి పనులు లేనప్పుడు అప్పలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారమని నేడు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా సొంతగా కిరాణా షాపును నడుపుకోవడం చాలా తృప్తిగా ఉందన్నారు. దీనికి తోడు స్వయంసహాయక సంఘంలో సభ్యులరాలుగా ఉన్నందున డ్వాక్రా ద్వారా వచ్చే ఆర్థిక సహాయంతో పచారి షాపును ఇంకా అభివృద్ది చేసి గ్రామంలోని ప్రజలకు పట్టణప్రాంతాల్లో దొరికే అన్ని పచారి సామానులు అందుబాటులో ఉంచడంతో పెట్టుబడితో పాటు లాభాలు కూడా వస్తున్నాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ జీవితం ఎలా ఉంటుంతో అని భయపడేవారమని, నేడు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించి మా జీవితాల్లో వెలుగు నింపి ఆర్థిక భరోసాను కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని మెండే ఆదమ్మ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *