-ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి ) ఇన్ ఛార్జ్ డా.ఎ.శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడ్కో నివాసాలకు సంబందించి లబ్దిదారులకు లోన్ డాక్యుమెంటేషన్ విషయమై కమిషనర్ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు ఎస్టేట్ ఆఫీసర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి ) ఇన్ ఛార్జ్ డా.ఎ.శ్రీధర్ పర్యవేక్షణలో గవర్నర్ పేట ఐ.వి.ప్యాలస్ నందు శిక్షణ కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమములో టిడ్కో ఇళ్ళకు సంబందించి బ్యాంక్ ద్వారా బుణ అందించుటకు ఏవిధంగా డాక్యుమెంటేషన్ చేయాలి అనే అంశాలపై ట్రైనింగ్ ఇస్తూ, అధికారులు సూచనలు చర్చించినారు. యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ద్వారా ఎంపిక చేసిన 1248 లబ్దిదారులకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రయ అంతయు పూర్తి చేసి ఫైనల్ డాక్యుమెంటేషన్ కూడా సత్వరమే లబ్దిదారులతో పూర్తి చేయునట్లుగా చూడాలని సూచించారు. దీనికి సంబంధించి యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా 5 బ్రాంచ్ లలోని 1248 లబ్దిదారులకు సోమవారం లబ్దిదారుల సమక్షంలో డాక్యుమెంటేషన్ పూర్తి చేసి వెనువెంటనే మంజూరు పత్రాల అందించుటకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని వివరించారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా 5 బ్రాంచ్ లకు సంబందించిన అధికారులు, DGM, RO, UBI, VJA వేగే రమేష్, చీఫ్ మేనేజర్ ఎస్.సాంబశివరావు, ఎ.జి.యం దివాకర్, డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ ఆనందరావు, UBI మార్కెటింగ్ అధికారులు, నగరపాలక సంస్థ సి.డి.ఓ లు దుర్గ ప్రసాద్, జగదీశ్వరి, శ్రీనివాస్ మరియు సి.ఓ లు, ఆర్.పి లు తదితరులు పాల్గొన్నారు.