Breaking News

నెయ్యి కల్తీ చేసిన కుట్రదారులను వదిలేదే లేదు

– కలియుగ దైవం పవిత్రత దెబ్బతీసేలా జగన్ రెడ్డి కుట్రలు చేశాడు
– పాలు సేకరించకుండా నెయ్యి ఎక్కడి నుండి తెచ్చారు
– హైందవ సంప్రదాయాలను అవమానించిన జగన్ రెడ్డిని ప్రజలు క్షమించరు
– తప్పు చేసినోళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఒక్క లీటర్ పాలు సేకరించి కంపెనీ 60లక్షల లీటర్ల నెయ్యి ఏ విధంగా టీటీడీకి సరఫరా చేసిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారికి సరిపడా నెయ్యి సరఫరా చేయాలంటే రోజుకి 4 లక్షల లీటర్ల పాలు అవసరం. కానీ, అసలు పాలే సేకరించని కంపెనీకి ఆర్డర్లు ఇచ్చి, వారి ద్వారా హవాలా పద్ధతిలో మీ అకౌంట్లలోకి కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయో నివేదికల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
చైర్మన్ పీఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎవరి కోసం వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, ‘ఏం జరగలేదు, కల్తీ లేదు’ అని బుకాయించడం సరికాదు. 2019-24 మధ్య నిబంధనలను సడలించి, పాలు లేకుండానే నెయ్యిని ఎలా సేకరించారో ప్రజలందరికీ తెలుసు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా, వాస్తవాలు దాగవు. కేవలం కాగితాల మీద కంపెనీలు సృష్టించి, తక్కువ ధరకే నెయ్యి ఇస్తామన్న కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టి, ఆ ముసుగులో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు.

ఎన్.డి.డి.బి (NDDB) ఇచ్చిన నివేదికలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా తేలింది. సుప్రీంకోర్టు కూడా దీనిపై సిబిఐ (CBI) మరియు సిట్ (SIT) లతో విచారణ జరిపిస్తోంది.
జగన్ రెడ్డికి హిందూ మతం మీద నమ్మకం లేదు. హైందవ సాంప్రదాయాలపై ఎలాంటి నమ్మకం లేదు. NDDB నివేదికలో జంతువుల కొవ్వు కలిసిందని తేలితే.. దాన్ని బుకాయించాలని జగన్ రెడ్డి చూస్తున్నారు. ఈ దుర్మార్గానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై ఉంది.

తిరుమల దేవాలయానికి ఇతర మతస్తులు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలనే నియమం ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి, విదేశీ అధ్యక్షులు సైతం గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చారు. కానీ జగన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆ నియమాన్ని పాటించలేదు. పైగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులతో కలిసి వెళ్లాలనే సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టారు. గతంలో అబ్దుల్ కలాం గారు వెళ్ళినప్పుడు ఇచ్చారు, విదేశీ అధ్యక్షులు వెళ్ళినప్పుడు ఇచ్చారు, సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు ఇచ్చారు. కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ఆ డిక్లరేషన్ ఇవ్వలేదు. అంటే వ్యవస్థలపై ఎంతటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.

డిక్లరేషన్ మీద సంతకం పెడితే, అన్యమతస్థులే అని ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి, రాజకీయంగా నష్టం వస్తుందనే ఉద్దేశంతోనే ఐదేళ్లపాటు ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా, అక్కడ ఉన్నటువంటి అధికారులును భయపెట్టి లోపలికి వెళ్లారు. గత ఐదేళ్లు జరిగిన పాప పరిహారం కోసం ఇవాళ ప్రక్షాళన జరుగుతుంటే, దాన్ని రాజకీయం చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కోర్టులకి వెళ్తున్నారు. కోర్టులు కూడా మొట్టికాయలు వేస్తున్నాయి. ఇప్పటికైనా నిజం ఒప్పుకోండి. స్వామివారి దగ్గర క్షమాపణ కోరాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *