-మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ కొత్త వెబ్ సైట్ ను ఆవిష్కరించిన మంత్రి
-123 మున్సిపాల్టీలకు అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డుతో కొత్త వెబ్ సైట్ లు రూపకల్పన
-టౌన్ ప్లానింగ్ విభాగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చినందుకు డైరెక్టర్ విద్యుల్లతను అభినందించిన మంత్రి
-అన్ని మున్సిపాల్టీలో ఘన,ద్రవ వ్యర్ధాల నిర్వహణ,తాగునీరు,స్ట్రీట్ లైట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
-అనధికార భవనాలు,లేఅవుట్లు క్రమబద్దీకరించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి
-వీధి కుక్కలు,పందులతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని మున్సిపాల్టీల్లో ఘన,ద్రవ వ్యర్ధాల నిర్వహణకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నారాయణ సూచించారు…అనంతపురంలో జరుగుతున్న మున్సిపల్ కమిషనర్ల ప్రాంతీయ సదస్సుకు మంత్రి నారాయణ,సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు…ఈ సమావేశంలో పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,డైరెక్టర్ సంపత్ కుమార్,స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి,టిడ్కో ఎండీ సునీల్ రెడ్డి,పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత,ప్రజారోగ్య విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్ తో పాటు 42 మున్సిపాల్టీల కమిషనర్లు పాల్గొన్నారు…మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ తో పాటు మొత్తం 123 మున్సిపాల్టీలకు కొత్తగా రూపొందించిన వెబ్ సైట్ లను మంత్రి నారాయణ ఆవిష్కరించారు.రాష్ట్రంలోని 123 మున్సిపాల్టీలకు అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డుతో పూర్తి సమాచారంతో పాటు ఆన్ లైన్ పేమెంట్స్ చేసేలా ఈ వెబ్ సైట్ లు రూపొందించారు.ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ పలు సూచనలు చేసారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించడంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి అమృత్ తో పాటు వివిధ పథకాల ద్వారా పనులు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు..ఆయా పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కొలిక్కి చేరుకుందన్నారు..వచ్చే నెల రెండో వారంలో సీఎం చంద్రబాబు ఆయా పనులకు శంఖుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు..రెండేళ్లలోగా ఈ పనులు పూర్తి చేస్తామని అన్నారు.అన్ని మున్సిపాల్టీల్లో ఘన,ద్రవ వ్యర్ధాల నిర్వహణ,రోడ్లు,వీధి లైట్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు..ప్రతి రోజూ పారిశుద్య నిర్వహణపై కమిషనర్లు మానిటరింగ్ చేయాలని సూచించారు..రోడ్లను శుభ్రం చేసేందుకు స్వీపింగ్ మెషీన్లు మాత్రమే ఉపయోగించాలని అన్నారు..అనధికార భవనాలు,లేఅవుట్లను క్రమబద్దీకరించుకునేలా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.నిబంధనలకు వ్యతిరేకంగా ఉండే వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు..అన్ని మున్సిపాల్టీల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు.మార్చి 31 నాటికి లెగసీ వేస్ట్ ను పూర్తిగా తొలగించి ఆయా ప్రాంతాలను పార్కులుగా అభివృద్ది చేయాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.కుక్కలు,పందుల తో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
టౌన్ ప్లానింగ్ లో దేశంలోనే టాప్ లో ఏపీ…..నారాయణ
పట్టణ ప్రణాళికా విభాగంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కీలక సంస్కరణలు తీసుకొచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు.లేఅవుట్లలో రోడ్ల వెడల్పు తగ్గించడం,సెట్ బ్యాక్ లు తగ్గింపు,ఫైర్ నిబంధనలు సరళతరం చేయడంతో పాటు అనుమతుల విషయంలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చామని మంత్రి చెప్పారు…టౌన్ ప్లానింగ్ లో దేశంలోనే ముందంజలో ఉండేలా సంస్కరణలు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన ఆ విభాగం డైరెక్టర్ విద్యుల్లతను మంత్రి నారాయణ అభినందించారు.
కొత్త వెబ్ సైట్ వల్ల ప్రజలకు ఎన్నో లాభాలు…..మంత్రి నారాయణ
కొత్తగా ప్రారంభించబడిన వెబ్‌సైట్‌లు మునిసిపల్ సేవలు, తాజా అప్‌డేట్‌లు, నోటిఫికేషన్‌లు మరియు అధికారిక సోషల్ మీడియా ఫీడ్‌లపై సమగ్ర సమాచారాన్ని అందించనున్నాయి…ప్రజలకు కావలసిన త్వరిత వివరణలు మరియు సహాయాన్ని అందించడానికి రూపొందించబడిన పురమిత్ర అనే AI-ఆధారిత వర్చువల్ అసిస్టెంట్‌ను ఈ వెబ్ సైట్ లకు ఇంటిగ్రేట్ చేసారు….పురమిత్ర ద్వారా, పౌరులు తమ మొబైల్ నంబర్‌లను ఉపయోగించి సులభంగా అవసరమైన సర్వీస్ ను నమోదు చేసుకోవచ్చు మరియు లాగిన్ చేయవచ్చు.అసెస్‌మెంట్‌లు లింక్ చేయబడిన తర్వాత మునిసిపల్ సేవలు, ఫిర్యాదులు మరియు ఆస్తి వివరాలకు సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలలోని ప్రజలు డాష్‌బోర్డ్‌లు, సిటీ మ్యాప్‌లు, ఇతర కార్యకలాపాలు, మునిసిపల్ కమీషనర్‌ల నుండి అప్‌డేట్‌లు మరియు వారి సంబంధిత ULBల యొక్క అధికారిక సోషల్ మీడియా కంటెంట్‌తో సహా ULB-నిర్దిష్ట సమాచారానికి ఉపయోగపడుతుంది..ఈ వెబ్ సైట్ లు డిజిటల్ గవర్నెన్స్,సిటిజన్-సెంట్రిక్ సర్వీస్ డెలివరీ కోసం రూపొందించారు.
Prajavartha Online Telugu News