Breaking News

పింఛను లబ్దిదారులకు పింఛను అందించిన విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ శనివారం ఉదయం ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ పరిసర ప్రాంతాలని పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పింఛను లబ్దిదారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్) ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ మాట్లాడుతూ ఉదయం ఆరింటికల్లా పెన్షన్ పంపిణీ మొదలుపెట్టాలని, పెన్షన్ పంపిణీలో ఎటువంటి అలసత్వం వహించరాదని, పెన్షన్ దారుల ఇంటి వద్దకు వెళ్లి కచ్చితంగా పెన్షన్ అందించాలని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోగల సర్కిల్ 1 పరిధిలో 17,761 పెన్షన్లు, సర్కిల్ 2 పరిధిలో 22,806, సర్కిల్ 3 పరిధిలో 17,609 పెన్షన్లు ఉన్నాయని, వారందరికీ సిబ్బంది సకాలంలో పెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ పర్యటనలో ఇంచార్జి కమిషనర్ తో పాటు సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *