గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సుశ్రుత మహర్షి విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నశీర్ అహ్మద్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ఆవిష్కరించారు.
పెమ్మసాని మాట్లాడుతూ సుశ్రుత మహర్షి భారత దేశంలో పలు రకాల సర్జరీలకు ఆయన ఆద్యులు.. అలాంటి సుశ్రుతుడి విగ్రహాన్ని.. డా. రాజా కరణం గారి సతీమణి డా. నిర్మలా కరణం విగ్రహాన్ని, అలాగే GMC ప్రాంగణంలోనే ఆంపి థియేటర్ను ప్రారంభించుకోవడంలో డా. రాజా కరణం పాత్ర ప్రముఖమైనది. బొంగడాల బీడులో మెడికల్ పరంగా ఒక ప్రత్యేక wing ను ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నటువంటి రాజా కరణం కి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. కార్యక్రమంలో భాగంగా రాజా కరణం ని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సత్కరించారు.
ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ఎన్నో లక్షల మందికి చికిత్సలు అందిస్తున్నటువంటి మన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి.. ఎప్పటికప్పుడు మరో అడుగు ముందుకు వేస్తుంది. పుట్టిన గడ్డపై ప్రేమతో ఎందరో ఎన్నారైలు మన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్తులవుతున్నారు. అందులో భాగంగా మన డాక్టర్ రాజా కరణం పాత్ర ప్రముఖమైనది. అలాంటి రాజా కారణం ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స పితామహుడు సుశ్రుత మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
డాక్టర్ రాజా కరణం మాట్లాడుతూ శాస్త్ర చికిత్స పీతామహుడు సుశ్రుత మహర్షి భారతదేశంలోనే రెండో విగ్రహంగా గుంటూరు మెడికల్ కాలేజీలో ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేకంగా రావడం చెప్పుకోదగ్గ అంశం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పక్కనే ఉండి ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపరిండెంట్ యశస్వి రమణ, కార్పొరేటర్ పోతురాజు సమత, జింకన్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News