-దీర్ఘ కాలిక లక్ష్యాల సాధనకు ఈ బడ్జెట్ దారి చూపుతుంది : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశాన్ని స్థిరమైన, బలమైన ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్లే దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్ దేశానికి స్పష్టమైన దారి చూపిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఆర్థిక పురోగతి సాధించేలా 2026-27 కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ కి, అలానే 9 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కి ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేలా, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పేద, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి దోహదపడేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఆయన అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఆకాంక్షలను నెరవేర్చే విధంగా లక్ష్యాలను నిర్దేశించిందన్నారు.
ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి చేసిన కీలక ప్రకటనలకు కూడా రాష్ట్ర ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లు. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై, బెంగళూరు–చెన్నై. వీటి ద్వారా రాష్ట్రం లభ్దిపొందుతుంది. ఎకానమీ పై ప్రభావం ఉంటుంది. ఇంటగ్రల్ సెమి కండక్టర్ మిషన్ 2.0 పథకాన్ని రూ.40,000 కోట్లకు విస్తరించడం గొప్ప పరిణామం. దీని ద్వారా రాష్ట్రానికి కూడా లబ్ది చేకూరుతుంది. వస్త్ర (టెక్స్టైల్) రంగానికి మద్దతు పలికేలా క్లష్టర్ల ఏర్పాటు మంచి పరిణామం. దీని ద్వారా నేత కార్మికులకు, కళాకారులకు ఉపాథి లభిస్తుంది. డాటా సెంటర్లు ఏర్పాటు కు 2047 వరకు పన్ను మినహాయింపులు. ఇది ఈ రంగాన్ని ఎంతో ప్రోత్సమిస్తుంది” అని మంత్రి కేశవ్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో కొబ్బరి, కోకో, జీడిపప్పు వంటి వాణిజ్య పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం రాష్ట్ర రైతులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున రైతులు కొబ్బరి, కోకో, జీడిపప్పు పంటలను సాగు చేస్తున్నారు. రైతుల ఆదాయం మెరుగుపడే దిశగా ఇది కీలక అడుగుగా నిలుస్తుంది. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఆంధ్రప్రదేశ్ తో సహా 5 రాష్ట్రాల్లో ఖనిజాల వెతికితీత పథకం కూడా రాష్ట్రానికి మేలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఖనిజ వనరులను దేశాభివృద్ధికి వినియోగించుకునే దిశగా ఇది ముఖ్యమైన నిర్ణయం అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పూర్వోదయ పథకంలో భాగంగా భవిష్యత్ లో రాష్ట్రానికి లబ్ది జరుగేలా నిర్ణయాలు ఉంటాయని మంత్రి కేశవ్ అభిప్రాయ పడ్డారు.
Prajavartha Online Telugu News