-బాయిలర్ల సంచాలకులు బి. ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
ప్రభుత్వ బాయిలర్ల శాఖలో బాయిలర్ అటెండెంట్ పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని చైర్‌పర్సన్, కమిటీ ఆఫ్ ఎగ్జామినర్స్, బాయిలర్ల సంచాలకులు బి. ఉమామహేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఏడాది మే/జూన్ నెలల్లో నిర్వహించబోయే మొదటి, రెండవ తరగతి (First & Second Class) పరీక్షల నిర్వహణ కు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నామన్నారు. అర్హతలు, విద్యార్హత, వయస్సు, పని అనుభవం వంటి పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చున్నారు. పరీక్షలు నిర్వహించే తేదీలు, పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను మార్చి31వ తేదీ సాయంత్రం 05:00 గంటల లోపుగా సమర్పించాల్సి ఉంటుందని చైర్‌పర్సన్, కమిటీ ఆఫ్ ఎగ్జామినర్స్, బాయిలర్ల సంచాలకులు బి. ఉమామహేశ్వరరావు ఆ ప్రకటనలో తెలియజేశారు..
Prajavartha Online Telugu News