విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు రాష్ట్రాలలో పత్రిక రంగంలో దూసుకు పోతున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ 2026 క్యాలెండర్ ను ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ 6 వసంతంలో అడుగుపెడుతున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ పత్రిక చైర్మన్ కొండూరి శ్రీనివాసరావు కు మా అభినందనలు అన్నారు. నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిల ఉంటూ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ వాటిని పరిష్కర మార్గం చూపిస్తున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ యాజమాన్యాన్ని అభినందిస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News