Breaking News

లండన్,దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన

-అమరావతి లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ,టూరిజం ప్రాజెక్టుల నిర్మాణం కోసం విదేశీ పర్యటన
-స్పోర్ట్స్ సిటీలు,రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు అధ్యయనం చేసిన మంత్రి బృందం
-దోహా స్పోర్ట్స్ సిటీ తరహాలో అమరావతి స్పోర్ట్స్ సిటీలో పలు ప్రాజెక్టుల నిర్మాణం
-థేమ్స్ నది రివర్ ఫ్రంట్ తరహాలో కృష్ణా రివర్ ఫ్రంట్ అభివృద్ధి కి ప్రణాళికలు

ఖతార్/దోహా/లండన్, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతిలో నిర్మించే పలు ప్రాజెక్టుల అధ్యయనానికి విదేశీ పర్యటనకు వెళ్ళారు మంత్రి నారాయణ..ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచంలో టాప్ 5 రాజధానులలో ఒకటిగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నారు..దానికి తగినట్లుగానే మాస్టర్ ప్లాన్ రూపకల్పన తో పాటు కీలక ప్రాజెక్టుల నిర్మాణం కోసం అనేక దేశాల్లో అధ్యయనం చేస్తున్నారు…దీనికోసం మంత్రి నారాయణ తో పాటు అధికారులు పలు దేశాల్లో ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టులను,ప్రాంతాలను పరిశీలించి బెస్ట్ మోడల్స్ ను పరిగణనలోకి తీసుకుంటున్నారు.తాజాగా అమరావతిలో నిర్మించే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ,టూరిజం ప్రాజెక్టుల అధ్యయనానికి యూకేలోని లండన్,ఖతార్ రాజధాని దోహాలో పర్యటించారు మంత్రి నారాయణ…ఈ పర్యటనలో మంత్రి నారాయణ వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ కూడా ఉన్నారు…

రెండు రోజులపాటు లండన్ లో పర్యటించిన మంత్రి నారాయణ బృందం…సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై లండన్ అభివృద్ధి ప్రణాళికలు,టూరిజం ప్రాజెక్టులపై చర్చించారు.. థేమ్స్ నది ఒడ్డున అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన రివర్ ఫ్రంట్ ను పరిశీలించారు…కృష్ణా నదీ తీరాన రివర్ ఫ్రంట్ అభివృద్ధి
కి థేమ్స్ రివర్ ఫ్రంట్ ను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి నారాయణ అభిప్రాయపడ్డారు.
లండన్ లోని బాటర్సీ పవర్ స్టేషన్ ను సందర్శించారు…ఆ తర్వాత ప్రపంచంలోనే ఎత్తైన కాంతిలివర్ద్ అబ్జర్వేషన్ వీల్ అయిన లండన్ ఐ ను అధ్యయనం చేశారు…ఇప్పటికే అమరావతిలో లండన్ ఐ తరహాలో ఒక భారీ వీల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక రెండో రోజు లండన్ స్ట్రాట్ ఫోర్డ్ లోని క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్ ను మంత్రి నారాయణ బృందం పరిశీలించింది…2012 లో ఒలింపిక్ గేమ్స్ కోసం నిర్మించిన ఈ స్పోర్ట్స్ పార్క్ లోని పలు క్రీడా పార్కులు(ప్లే జోన్స్)ను పరిశీలించి వాటి నిర్మాణం గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు..ప్రసిద్ధ లండన్ స్టేడియం,లండన్ ఆక్వాటిక్స్ సెంటర్,హైడ్ పార్క్, లీ వ్యాలీ వేలోపార్క్ ల నిర్మాణాలను సందర్శించి వాటిని అధ్యయనం చేశారు.

రెండు రోజుల పర్యటన తర్వాత లండన్ నుంచి నేరుగా ఖతార్ రాజధాని దోహా కు చేరుకున్న మంత్రి నారాయణ బృందం…అక్కడి స్పోర్ట్స్ ప్రాజెక్టులను సందర్శించింది.ఆస్పైర్ జోన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా పిలిచే
దోహా స్పోర్ట్స్ సిటీని మంత్రి బృందం సందర్శించింది.స్పోర్ట్స్ సిటీలోని ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం,ఆస్పిటర్ స్పోర్ట్స్ హాస్పిటల్,ఆస్పైర్ అకాడమీలను పరిశీలించి వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు…వివిధ రకాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ లతో అంతర్జాతీయ క్రీడలకు గమ్య స్థానంగా దోహా స్పోర్ట్స్ సిటీ పేరుగాంచింది..250 హెక్టార్ల లో భారీ విస్తీర్ణంలో ఉన్న స్పోర్ట్స్ సిటీలో 2006 లో ఆసియన్ గేమ్స్ నిర్వహించారు…ఇదే స్పోర్ట్స్ సిటీలో ఆసియా లోనే మొదటి స్పోర్ట్స్ మెడిసిన్ హాస్పిటల్ గా ఉన్న ఆస్పిటర్ స్పోర్ట్స్ హాస్పిటల్ కూడా ఉంది..అలాగే 2022 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించిన లుసైల్ స్టేడియం ను సందర్శించి అంతర్జాతీయ క్రీడలను ఏ విధంగా నిర్వహించారని అడిగి తెలుసుకున్నారు.అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికల గురించి దోహా అధికారులతో మంత్రి నారాయణ బృందం చర్చించింది…

త్వరలోనే అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తుంది ప్రభుత్వం..లండన్,దోహా ల పర్యటన తర్వాత అక్కడ అభివృద్ధి చేసిన కొన్ని ప్రాజెక్టులను అమరావతిలో కూడా అమలు చేసేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.మూడు రోజుల పర్యటన ముగించుకుని భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం మంత్రి నారాయణ బృందం విజయవాడ చేరుకోనుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *