Breaking News

మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా వెనుకబడిన వర్గాలు

-సాస్కీ నిధులతో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం
-ఆదరణ -3 ద్వారా ఆధునిక పరికరాల పంపిణీకి చర్యలు
-బీసీ సంక్షేమశాఖ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వెనుకబడిన వర్గాలను మైక్రో ఎంట్రప్రెన్యూర్లుగా, ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ తయారుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆదరణ 3 పథకం ద్వారా కులవృత్తుల వారీగా ఆధునిక పరికరాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం బీసీ సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణంతో పాటు అక్కడ సురక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
రూ.60 కోట్ల సాస్కి నిధులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. 814 బీసీ సంక్షేమ హాస్టళ్లలో రూ.17 కోట్ల వ్యయంతో మార్చిలోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో పాటు హాస్టళ్లలో శానిటేషన్ తో పాటు విద్యార్ధులకు అందించే ఆహార నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్ధుల ఆరోగ్యం, విద్యా బోధన సహా అన్ని అంశాల్లోనూ బెస్ట్ ప్రాక్టీసెస్ అనుసరించాలని సూచనలు ఇచ్చారు. బీసీ విద్యార్ధులకు విద్యాపరమైన అంశాల పర్యవేక్షణకు అపార్ ఐడీలను నమోదు చేసి అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న బీసీ భవనాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 6 మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెట్ జీరో కాన్సెప్టు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిళ్లను తదుపరి స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. వెనుకబడిన వర్గాలకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వారికి ప్రయోజనం కలిగేలా పథకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *