
-21 మందితో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నూతన కమిటి ఎన్నిక
-చైర్మన్ బొప్పరాజు నాల్గవసారి ఏకగ్రీవ ఎన్నిక….
-సెక్రటరీ జెనరల్ గా పలిశెట్టి దామోదరరావు రెండవసారి ఏకగ్రీవ ఎన్నిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపి జేఏసి అమరావతి ప్రారంబించిన అతి కొద్ది సంవత్సరాలలోనే అన్ని డిపార్టు మెంటు ఉద్యోగులలో స్దానం సంపాదించి 2017 పిభ్రవరి 5 న 15 సంఘాలతో ఆవిర్బవించిన ఏపిజేఏసి అమరావతి నేటికి అంచేంచేలుగా ఎదిగి ఉద్యోగుల గుండేళ్లో ప్రధమ స్దానం సంపాదించి 96 డిపార్టుమెంటు సంఘాల కలయికతో గురువారం విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్న తుమ్మలపల్లి కళాక్ష్యేత్రంలో ఏపిజేఏసి అమరావతి నాల్గవ రాష్ట్రమహాసభ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్బంగా జెఏసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొంతకాలంగా ఉద్యోగులను దూరం పెట్టినప్పటికీ గత ఏడాది అక్టోబర్ 18 న మంత్రవర్గ ఉప సంఘం సభ్యులతోను, ముఖ్యమంత్రి తోను ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగిన అనంతరం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం మొదలు పెట్టీ కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించీనందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మరియు మంత్రివర్గ ఉప సంఘం సభ్యులకు ఏపీ జేఏసీ అమరావతి పక్షాన కృతగ్ఞతలు తెలియజేసారు.
అయితే, కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావాలని బలంగా కోరుకున్న ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామిలు మేరకు 12 వ పీఆర్శీ కమీషన్ వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలనీ, అంతే కాకుండా గత ప్రభుత్వం హయాం నుండి ఉద్యోగుల చెల్లించాల్సి బకాయిలు సుమారు 30 వేల కోట్లు రూపాయలకు చేరుకున్నాయి. కావున వెంటనే రిటైర్డు/పెన్షనర్ల కు, చనిపోయిన ఉద్యోగులకు వెంటనే వారికి చెల్లించాల్సి రీటైర్డు మెంటు సెటిల్ మెంటు బకాయిలు చెల్లించాలని, సర్వీసులో ఉన్న ఉద్యోగులకు చెల్లించాల్లిన భకాయిలు ఎంతో స్పష్టంగా వారి వారి పే స్లిప్పుల్లో నమోదు చేసి, 11 వ పిఆర్శీ బకాయిలతో పాటు, సరండర్ లీవులు, లీవ్ ఎన్ క్యాష్ మెంటు తధితర చెల్లింపులతోపాటు, పెన్షనర్లకు నిలిపివేసిన అడిషనల్ కోంటమ్ ఆఫ్ పెన్షన్ ను 15% ఉన్నదానిని గత ప్రభుత్వం 10%తగ్గంచిన దానిని 15% కుపునరుద్దరిచ్చాలని తదితర సమస్యలు నాల్గవ రాష్ట్ర మహాసభ ద్వారా తీర్మానించడమైనది.
ఈ సమావేశంలో ముఖ్యఅతిధిలుగా ఆర్దికశాఖా మాత్యులు పయ్యాల కేశవ, వైద్య, ఆరోగ్యశాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్ ఇద్దరు పాల్గోన్నారు.
ఈ సందర్బంగా ఆర్థిక శాఖామాత్యులు .పయ్యల కేశవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులు వేరుకాదని సమస్యలు అన్ణి పరిష్కరిస్తామని ఉద్యోగుల సమస్యలు అన్ని చర్చలు ద్వారా పరిష్కరించే ప్రభుత్వం మాదని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రధానంగా ఉద్యోగవర్గంలో 60% ఉన్న మహిళా ఉద్యోగులకు ప్రయోజనం కల్పించేలా దేశంలోనే మొట్టమొదటిసారి చైల్డుకేర్ లీవు కు ఉన్న ఏజ్ లిమిట్ ను సడలింపుచేస్తు ఉద్యోగి రిటైర్ అయ్యేలోగా ఎప్పుడైనా వాడుకోనే ఆదేశాలు ఇవ్వండం చారిత్మాక నిర్ణయమని అభివర్ణించారు. అలాగే ఏపియస్ ఆర్టీసీ ఉద్యోగులకు విలీనం అనంతరం గత ప్రభుత్వం తొలగించిన సౌకర్యాలను ఏపి జేఏసి అమరావతి మరియు ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులు మేరకు ఇటివల 11 జిఓలు ఇవ్వడం వలన సర్వీసులో ఉన్నవారికి, రిటైర్ అయిన, అవ్వబోతున్న ఉద్యోగులలో సుమారు 70 వేల మందికి ఆర్టీసి ఉద్యోగులకు ప్రయోజం కల్పించేలా ఆదేశాలు ఇవ్వడం పట్ల ఆర్టీసి ఉద్యోగులందరి తరుపున ప్రభుత్వానికి ఏపిజేఏసి అమరావతి తరుపున ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ సమావేశంలో మహాసభ నివేధికను ను ప్రవేశ పెట్టిన ఏపిజేఏసి అమరావతి స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ పెండింగు కారుణ్య నియామాకాలు, సిపియస్ ఉద్యోగులకు ఆర్దికంగా పెండింగు రూః3,500 కోట్లు ఇవ్వడంతోపాటు రెగ్యూలర్ గా అఫ్ డేట్ చేస్తున్నారని తెలిపారు.
ఆర్టీసి ఉద్యోగులకు సంబందించిన అధిక సమస్యలు కూడా పరిష్కరించినందుకు కృతగ్ఞతలు తెలియజేసారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా మంచి ఫిఆర్శీ, తక్షణమే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని, పిఆర్శీ, డిఏ బాకాయిలు చెల్లించాలని, సరండలీవులు, లీవ్ ఎన్ క్యాష్ మెంటు బకాయిలు చెల్లించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టీ దామోదరరావు లు విజ్ఞప్తి చేసారు.
21 మంది తో ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర నూతన కమిటి 21 మంది సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నిక..
స్టేట్ చైర్మన్ గా వరుసగా నాల్గవసారి బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జెనరల్ గా రెండవసారి పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ గా టి.వి.ఫణి పేర్రాజు, కోశాధికారిగా తిమ్మసర్తి నాగేశ్వరరావు తో పాటు ప్రచారకార్యదర్శి గా శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గా బి.కిషోర్ కుమార్ తదితరులు ఎన్నికయ్యారు.
Prajavartha Online Telugu News