Breaking News

పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణే మా ప్రథమ ప్రాధాన్యత – ఎస్.సి.ఇ.ఆర్.టి డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ‘పాఠశాలల భద్రత రక్షణ’ అంశంపై ఈరోజు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఎస్.సి.ఇ.ఆర్.టి (SCERT) డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో సమగ్ర వికాసాన్ని పెంపొందించాలన్నారు. పాఠశాల వాతావరణం ఆనందదాయకంగా, సురక్షితంగా ఉన్నప్పుడే పిల్లలు ఉత్సాహంగా చదువుకోగలరని, జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం, గ్రామీణ ప్రాంత విద్యార్థులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, చిన్న పొరపాట్లు కూడా పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు.
ముఖ్యమైన అంశాలు:
• చట్టాల అమలు: పాఠశాల భద్రతా చట్టం 2016, విద్యా హక్కు చట్టం (RTE) 2009లను పటిష్టంగా అమలు చేయాలి.
• బోధనా పద్ధతులు: విద్యార్థుల కోసం అకడమిక్ క్యాలెండర్లు, వర్క్ షీట్లు, నో-బ్యాగ్ డేస్ (No-Bag Days), హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
• మౌలిక సదుపాయాలు: పాఠశాల భవనాల పటిష్టత, విద్యుత్ సౌకర్యాల తనిఖీ, మరియు పరిశుభ్రమైన పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలి.
• సామాజిక స్పృహ: విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో (POCSO) చట్టం, బాల్య వివాహాల నిరోధం, మరియు మాదకద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన కల్పించాలి.
యూనిసెఫ్ ప్రతినిధులు జెలాలెం బిర్హాను తప్పెసె, డానిష్ అజీజ్ మాట్లాడుతూ, పాఠశాల ఆవరణలో విద్యార్థులపై ఎటువంటి శారీరక, మానసిక వేధింపులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పాఠశాలల బయట విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పర్యవేక్షించాలని, ఇందులో గ్రామ పంచాయతీలు, ఆరోగ్య, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
విజయవాడ ఏసీపీ డి. ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలన్నారు. “డిజిటల్ అరెస్ట్” అనే విధానం చట్టంలో లేదని, అపరిచితుల నుంచి వచ్చే డిజిటల్ కాల్స్ పట్ల భయపడకూడదని స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల కేసుల్లో మైనర్ల సమ్మతి అనేది చట్టపరంగా చెల్లదని, నేరస్థులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల భద్రతా నోడల్ అధికారిణి వి. విజయ దుర్గతో పాటు యూనిసెఫ్, మహిళా శిశు సంక్షేమ శాఖ, అగ్నిమాపక శాఖ, ఆహార భద్రత విభాగం ఇతర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *