Breaking News

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ పైపుల్ రోడ్డు సెంటర్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే తనయుడు బోండా సిద్ధార్థ  హాజరయ్యారు. అన్నదాన కార్యక్రమం రెండు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పైపుల రోడ్డు సెంటర్లో 400 నుండి 500 మందికి స్వయంగా ట్రస్ట్ మెంబర్స్ వంటలు వండి వడ్డించడం జరుగుతుంది. ఆ మహనీయురాలు డొక్కా సీతమ్మ పేరు పెట్టుకుని ఇంతమంది ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మేము ఈ కార్యక్రమానికి పడ్డ కష్టం మొత్తం ఆకలితో ఉన్నవారు భోజనం చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు సపోర్ట్ గా నేను చేసే ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకరాలు అవుటుపల్లి విజయ కుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షురాలు సంసాని విజయలక్ష్మి, ట్రస్టు ఉపాధ్యాయులు గుబ్బల జ్యోతిశ్వరి, ట్రస్ట్ కోశాధికారి యర్రోజు అభిలాష్, దాసరి ప్రశాంతి, మల్లంపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *