రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక గుడిసె ఇంట్లోకి ప్రవేశించిన పులి సుమారు నాలుగు గంటల పాటు అక్కడే , అదే పాకలో ఉన్నప్పటికీ, సమీపంలో ఉన్న రెండు గేదెలకు ఎలాంటి హాని కలగలేదని జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామంలో ఉన్న పశువులను లేదా ప్రజలను పులి ఎలాంటి విధంగా హానిచేయకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. పులి ప్రవర్తనలో సహజ వన్యప్రాణి లక్షణాలు స్పష్టంగా కనిపించాయని, ఇది వన్యప్రాణుల పరిరక్షణకు ఒక మంచి ఉదాహరణగా నిలిచిందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా అటవీ శాఖ సేకరించిందని ఆయన తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామ ప్రజలు ఆందోళన చెందకుండా, అటవీ శాఖ, పోలీసు సిబ్బంది సూచనలను పాటించాలని జిల్లా అటవీ అధికారి కోరడం, వారు సహకరించడం జరిగిందన్నారు. గ్రామంలో నిరంతర నిఘా వ్యవస్థ కొనసాగింపు, ఆ మేరకు పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచామని ఆయన తెలిపారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …
Prajavartha Online Telugu News