విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాండ్రంకి గౌతమ్ విద్యాసంస్థల దుర్గాపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గౌతమ్ స్కూల్ 38వ వార్షికోత్సవ (అన్యువల్ డే) కార్యక్రమం ఘనంగా జరిగింది. శనివారం 33వ డివిజన్ BRTS రోడ్డు, ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… విద్య ద్వారానే విద్యార్థుల భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుందని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ విద్యా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో, కష్టపడి చదివి మంచి లక్ష్యాలను సాధించాలని సూచిస్తూ ప్రేరణాత్మక సందేశం అందించారు.
గౌతమ్ విద్యాసంస్థల చైర్మన్ పాండ్రంకి చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ పాఠశాలలో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, సమర్థులైన ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. అన్ని విధాలా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తాము చదువుకున్న పాఠశాలను మర్చిపోకుండా ఉన్నత స్థాయిలో ఎదగాలన్నారు. పోటీ పరీక్షలో కూడా విజయం సాధించడానికి కావలసిన నైపుణ్యాలను పెంపొందిస్తామన్నారు. పిల్లల విద్యాభ్యాస విషయంలో ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, డివిజన్ ప్రెసిడెంట్ దాసరి జయరాజు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News