విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIDSO) ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ప్రధమ విజయవాడ జోన్ విద్యార్థుల మహాసభలను స్థానిక ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా విజయవాడలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికై విద్యార్థుల మహాసభలను ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య ఉపన్యాసకులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు వి హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేడు పూర్తిగా విద్య సామాన్యులకు దూరమయ్యే విధంగా విద్యా విధానాలు తీసుకొస్తున్నారని, విద్యార్థులు యువకులు యొక్క నీతి నైతిక విలువలు దిగజారే లాగా మద్యం మాధ్రవ్యాలు డ్రగ్స్ వంటి వాటిని అరికట్టకుండా పెంచి పోషించడాని ఈ సందర్భంగా ప్రశ్నించారు. మహనీయుల యొక్క ఉన్నత ఆదర్శాల ద్వారానే ఈరోజు సమాజంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి పోరాడే శక్తి వస్తుందని తెలిపారు.
మరొక వక్తగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి ఈ మహేష్ మాట్లాడుతూ చిన్నతనం నుండి నేతాజీ పేద ప్రజల కష్టాలకు చలించాడని, ICS లో ఉత్తమ ర్యాంక్ వచ్చినప్పటికీ భారతీయ స్వాతంత్రం కై దానిని వదిలి భారతీయుల విముక్తి కాంక్షకై పోరాడారు. విద్యార్థుల కర్తవ్యం కేవలం మార్కులు ర్యాంకులు మాత్రమే కాదని సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి నేతాజీ స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే శివప్రసాద్ మాట్లాడుతూ నేడు విద్య, సంస్కృతి, విలువలు పతనానికి నేటి ప్రభుత్వాల విధానాలే కారణమని తెలియజేస్తూ మహాసభల ద్వారా ఎన్నుకోబడ్డ కమిటీ విజయవాడలో ఉన్న సమస్యల పరిష్కారానికి పోరాడాలని అన్నారు.
ఈ మహాసభలలో విజయవాడ జోన్ వి త్రినాథ్ అధ్యక్షుడిగా, సంపత్ కార్యదర్శిగా, వసంత్, దుర్గాప్రసాద్ లవకుమార్ లు ఉపాధ్యక్షులుగా, అశోక్ కోశాధికారిగా, మణికంఠ, ప్రేమ్చంద్, భార్గవ్ సూరజ్ లు సహాయ కార్యదర్శిలుగా కమిటీ ఎన్నుకోబడింది.
Prajavartha Online Telugu News