Breaking News

భారతీయ వాయుసేన ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ*ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహణ

-ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు
-దేశ సేవలో పాల్గొనే అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి
-ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల భారత వాయు సేన భర్తీ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత వాయు సేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) లో “అగ్ని వీర్ -వాయు” గా భర్తీ చేసేటందుకు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ని మార్చ్ నెలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల భర్తీ అధికారి మరియు సికింద్రాబాద్ 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ అయిన వింగ్ కమాండర్ షేక్ యాకుబ్ అలీ తెలిపారు. 6 మార్చి 2026 (శుక్రవారం) న ఆయన సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ఐ. ఎ. స్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. మన రెండు తెలుగు రాష్ట్రాల యువతకు భారతీయ వాయు సేనలో జాయిన్ అవ్వడానికి ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా అదనపు అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. దానికి ఛీఫ్ సెక్రటరీ తమవంతు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గుంటారు జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి & సీఈవో గారికి దీని గురించి ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్ట్రార్ తో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించడానికి అనుమతి కోరమని, దానికి వాళ్లు వెంటనే మనస్పూర్వకంగా అంగీకరించారని చెప్పారు.
ఇంటర్, తత్సమాన విద్యార్హతలు (పాలిటెక్నిక్, ఐటిఐ) గల విద్యార్థిని, విద్యార్థులు “అగ్ని వీర్ -వాయు” గా భారత వాయుసేనలో చేరవచ్చని చెప్పారు. 17 1/2 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసుగల యువతీ, యువకులు దీనికి అర్హులన్నారు. చిన్న వయసులోనే దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుందని, దీనిని యువత అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *