-క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో యువతకు ఉజ్వల భవిష్యత్తు
-భూమి పూజతో ఐటీ రంగంలో సరికొత్త విప్లవానికి బీజం!
-సీఎం చంద్రబాబు కృషి ప్రశంసనీయ o
-రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గమనాన్ని మార్చే ఒక మహా అద్భుతానికి అమరావతి వేదికగా నిలిచిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు శనివారం సీఎం చంద్రబాబు చేతులమీదగా జరిగిన భూమి పూజ రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పబోతుందని వెల్లడించారు. దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటుకావడం రాష్ట్రానికే గర్వ కారణమని వ్యాఖ్యానించారు. క్వాంటం టెక్నాలజీతో యువతకు హైస్కిల్ ఉద్యోగాలు రావడమే కాకుండా… సరికొత్త ఆవిష్కరణలకు అమరావతి కేంద్రంగా ఉండబోతుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి గొప్ప పరిపాలనా రాజధానిగానే కాకుండా ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ గా రూపుదిద్దుకోవడం ఖాయమని పేర్కొన్నారు. కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సార్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ తదితర రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ ఉండబోతుందన్నారు.
నాడు హైటెక్ సిటీ..
నేడు క్వాంటం వ్యాలీ
దేశంలో ఇప్పటికే 25 క్యూబిట్ల సామర్థ్యంతో కేవలం రెండు క్వాంటం కంప్యూటర్లు మాత్రమే ఉన్నాయని మంత్రి సత్యకుమార్ చెప్పారు. అమరావతిలో ఏకంగా133 క్యూబిట్ల సామర్థ్యంతో అత్యంత ఆధునిక క్వాంటం కంప్యూటర్ సెంటర్ ఏర్పాటుకు సీఎం శ్రీ చంద్రబాబు కృషి చేయడం ఆయన దార్శనికతకు నిదర్శనమని చెప్పారు. ప్రపంచంలో తొలిసారిగా 2019లో కమర్షియల్ క్వాంటం కంప్యూటర్ను ప్రఖ్యాత ఐబీఎం సంస్థ ఆవిష్కరించిన ఏడు సంవత్సరాల్లోనే అమరావతిలో దానికి సీఎం శ్రీకారంచుట్టడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏర్పాటుతో ఐటీ రంగంలో సరికొత్త విప్లవాన్ని తెచ్చిన చంద్రబాబు కృషితో ఏర్పాటు కాబోతున్న క్వాంటం వ్యాలీ నవ్యాంధ్ర ఆర్ధిక వ్యవసకు కూడా వెన్నెముకగా ఉండబోతుందని కొనియాడారు కేంద్ర సంస్థలు, బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు, ఇతర సంస్థలు ఏర్పడబోతున్న అమరావతిలో క్వాంటం వ్యాలీ రాక సరికొత్త ఒరవడి సృష్టించబోతుoదన్నారు చెప్పారు. గత వైకాపా పాలనలో అమరావతి అభివృద్ధి ఘోరంగా దెబ్బతినిoదని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో అమరావతి లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News