విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ నందు ఆదివారం ఘనంగా నిర్వహించిన చిన్మయ మిషన్ 76వ వార్షికోత్సవం (అమృత మహోత్సవం) కార్యక్రమంలో భాగంగా జరిగిన మనుమాన్ చాలీసా 108 పారాయణం లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ సాంకేతికంగా, భౌతికంగా అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా, విలువలతో కూడిన అభివృద్ధే నిజమైన ప్రగతి అని, భగవద్గీత బోధించే స్వార్థరహిత కర్మ, నైతిక నాయకత్వం తమ ప్రభుత్వ పాలనకు మార్గదర్శక సూత్రాలుగా కొనసాగుతున్నాయని తెలిపారు. సమాజానికి 76 ఏళ్ల సేవ – స్ఫూర్తిదాయకం గత 76 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను ప్రజల్లో పెంపొందిస్తూ, సమాజ హితానికి చిన్మయ మిషన్ అందిస్తున్న సేవలు నిజంగా స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో సానుకూల దృక్పథాన్ని, మానవీయ విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ ప్రతినిధులు, ఆధ్యాత్మిక గురువులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News