-రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయంలో రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో నిర్వహించే సమీక్షకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు వర్చువల్ గా హాజరు కావాలి
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 9 న సోమవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల సెక్రటరీ లతో సమీక్ష సందర్భంగా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు వారి కార్యాలయం నుండి వర్చువల్ గా పాల్గొంటున్న సందర్భంగా జిల్లాలో పి జి ఆర్ ఎస్ కార్యక్రమంను రద్దు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10.30 గం.ల నుండి జరిగే ఈ సమీక్షకు జిల్లా స్థాయిలో సచివాలయం నుండి కలెక్టర్, ఎస్ పి, ఇతర జిల్లా స్థాయి అధికారులు, డివిజనల్ స్థాయి లో ఆర్ డి ఓ ల కార్యాలయం నుండి డి ఎల్ డి ఓ, డి ఎల్ పి ఓ, ఇతర డివిజనల్ స్థాయి అధికారులు, మండల, మున్సిపల్ స్థాయిలో తహశీల్దార్, ఎం పి డి ఓ ల ఆధ్వర్యంలో ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. స్వర్ణ గ్రామ, వార్డు సిబ్బంది కూడా తమ కార్యాలయం నుండి పాల్గొంటారన్నారు. సమీక్షకు వర్చువల్ గా హాజరై ముఖ్యమంత్రి సూచనలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. జిల్లా స్థాయి నుండి గ్రామ/వార్డు సచివాలయం స్థాయి వరకు సిబ్బంది సమీక్షకు హాజరవుతున్న కారణంగా పి జి ఆర్ ఎస్ కార్యక్రమం రద్దు పరచడం జరిగిందని, ప్రజలు గమనించి సహకరించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.
Prajavartha Online Telugu News