Breaking News

శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరన

మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 15వ తేదీ జరిగే మహా శివరాత్రి వేడుకలు విజయవంతం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. ఆదివారం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, మహా శివరాత్రి వేడుకల వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి ఆవిష్కరించారు. మహాశివరాత్రికి తరలివచ్చే వేలాది భక్తులకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఉత్సవాలు విజయవంతం చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), దేవస్థానం సూపరింటెండెంట్ అచ్యుత మధుసూధనరావు, దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *