Breaking News

నేడే ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు…

-ఈ నెల 10 వ తేదీన ఓట్ల లెక్కింపు… ఫలితాల ప్రకటన
-రిటర్నింగ్ అధికారిగా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 56,374 మంది నమోదిత వైద్యులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC)–2026 ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల ద్వారా మొత్తం 13 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. 84 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ​ఈ ఎన్నికల కోసం https://apmc.ap.gov.in. ద్వార ఫిబ్రవరి 9, 2026 న ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ​ఈ ఎన్నికలలో ఓటర్ల సహాయార్ధం చాటబోట్ [chatbot (APMC Chunav bot)] మరియు హాపీడేస్క్-helpdesk (9000780707, 9154032856) ను ఏర్పాటు చేయడమైనది. ​ఈ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు ని రిటర్నింగ్ అధికారిగా నియమించింది. ​ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన ఫిబ్రవరి 10, 2026 న ఉదయం 11.00 గంటల నుండి నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని పోటీ అభ్యర్థులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను హాజరుకావాలని ఆహ్వానించారు. ​అర్హత గల నమోదిత వైద్యులు అందరూ నిర్ణీత సమయంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *