అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై భారత్ (MY Bharat) కార్యక్రమం భాగంగా లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యన్.యస్.యస్. యూనిట్ ఆధ్వర్యంలో అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం (Inter-State Youth Exchange Program) (03-02-2026 నుండి 07-02-2026) ఐదు రోజుల పాటు కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు కార్యక్రమంలో కేరళ విద్యార్థులు వారి వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు, ఈ కార్యక్రమంలో యస్.శ్రీనివాస రావు, స్టెప్(STEP) మేనేజర్ మాట్లాడుతూ ఒక రాష్ట్ర యువత మరో రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలను తెలుసుకోవడం వలన యువతకు చాలా ఉపయోగమని అయన అన్నారు. అనంతరం మై భారత్ జిల్లా యువ అధికారి సుంకర రాము కేరళ విద్యార్థులకు మెమొంటోలను, సర్టిఫికేట్ అందించారు, అనంతరం వేదికను అలంకరించిన పెద్దలను మరియు కార్యక్రమంలో భాగంగా గెస్ట్ లెక్చర్ అందించిన యల్.బి.ఆర్.సి.ఈ ప్రొఫెసర్స్ ను సత్కరించారు. కేరళ విద్యార్థులు వారం రోజుల కార్యక్రమంలో నేర్చుకున్న, సందర్శించిన మరియు తెలుసుకున్న విషయాలను గురుంచి వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మై భారత్ జిల్లా యువ అధికారి సుంకర రాము, మై భారత్ కోఆర్డినేటర్ వినోద్, కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.అప్పారావు, వైస్ ప్రిన్సిపాల్ డా .రమేష్ రెడ్డి యల్.బి.ఆర్.సి.ఈ కళాశాల అసిస్టెంట్ యన్.యస్.యస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, శ్రీ.శీలం ఉమా మహేశ్వర రెడ్డి, కొండపల్లి మున్సిపల్ కమీషనర్ నాయక్, యు.పి .యస్.సి & సి.ఎ చంద్రిక మరియు కేరళ రాష్ట్ర విద్యార్థిని, విద్యార్థులు మరియు కళాశాల యన్.యస్.యస్ వాలంటీర్స్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News